పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే చిట్కాలు ఇవే..!

frame పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే చిట్కాలు ఇవే..!

lakhmi saranya
పేరెంట్స్ పిల్లలని క్రమశిక్షణలో పెట్టి పెంచాలి. పిల్లలు క్రమశిక్షణలో ఉంటే పేరెంట్స్ మాటను వింటారు. అల్లరిగా తిరుగుతూ ఉంటే అల్లరితనమే వస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల్ని చక్కగా పెంచాలని భావిస్తారు. కానీ బిజీ షెడ్యూల్ రిత్యా, పలు కారణాలతో పిల్లల పెంపకం పై పలు మిస్టేక్స్ చేస్తుంటారు. కాగా పిల్లలు పెద్దయ్యాక ఇతరులపై డిపెండ్ అవ్వాల్సిన సిచువేషన్ వస్తుంది. దీంతో వారు మెంటల్ గా వికలాంగులు మారే అవకాశం ఉంటుంది. హ్యాబిట్ పిల్లల ఫ్యూచర్ ను కూడా నాశనం చేస్తుంది.
కాగా పిల్లలకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదంటే... వారిని చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగేలా అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి. నిజంగా చిన్నతనం నుంచే వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే మార్గాలు చూసినట్లైతే... పేరెంట్స్ ఎప్పుడైనా సరే వారి పనులు వారినే చేసుకోనివ్వాలి. హోం వర్క్ దాని , బూట్లు, చెప్పులను సరైన ప్లేస్ లో ఉంచడం, తల్లిదండ్రులు ఫుడ్ తినిపించకుండా... వారిని తినమని చెప్పడం.. ఇలాంటివి అలవర్చాలి. దీంతో పిల్లలు ఆలోమేటిక్ గా క్రమశిక్షణగా నడుచుకుంటారు. అలాగే వారు చేసే తప్పుల్ని ప్రేమతో స్వాగతించాలి. కోపంతో అరిస్తే... వారు మానసికంగా బాధపడుతుంటారు.
మరోసారి తప్పు పని చెయ్యకుండా.. తిట్టకుండా కూల్ గా వారితో కూర్చుని వివరించండి. అప్పుడప్పుడు పిల్లలకు ఉపయోగపడే గిఫ్ట్స్ ఇవ్వండి. ఇంటి పనుల్లో కూడా పిల్లల్ని భాగస్వామ్యం చేయండి. స్వంత నిర్ణయాలు తీసుకునేలా అలవాటు చేయండి. ఏ ఫుడ్ తినాలి? ఏం చదవాలి? ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి? అనేది వారి డెసిషన్ ను వారికి వదిలేయండి. చిన్న ఏజ్ నుంచే కష్టపడి పనిచేస్తే.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది. ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ల నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: