విటమిన్ డి లోపం వల్ల ప్రెగ్నెన్సీ రాదా...?
ముఖ్యంగా ఈ సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిలో విటమిన్ టి తక్కువగా ఉన్నట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భధారణ సమయంలో విటమిన్ డి అనేది చాలా అవసరం. ఇది కాల్షియం, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యం గా ఉండాలంటే విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైనది. గర్భిణీలలో విటమిన్ డి లోపాన్ని ప్రి- ఎక్లాంప్సియా అని అంటారు. ఇది గర్భం దాల్చిన 20 వారాల తర్వాత దీని ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి తక్కువగా ఉంటే గర్భాశయం, ముందస్తు ప్రసవం, కర్బదారణ మధుమేహం, డెలివరీ సమయంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ విటమిన్ డి అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తుందని ఆధ్యాయణాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ లోపం కారణంగా డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ లోపం అనేది ఆహారపు అలవాట్లు, ఊపకాయం వంటి వాటి కారణంగా ఏర్పడుతుంది. కర్బదారణ టైమ్ లో సాధారణ విటమిన్-డి స్థాయి 30 mg/Ml లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దీనివల్ల తల్లి బిడ్డకు ఎటువంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపాన్ని అధికమించాలంటే తప్పనిసరిగా కూరగాయలు, పాల ఉత్పత్తులు, పండ్లు, గింజలు, పెరుగు, కొవ్వు చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, బాదం, తృణధాన్యాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. వీటిలో విటమిన్ డి సంవృద్ధిగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతిరోజు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్య రాశ్ని తగిలేలా చేసుకోవాలి.