ఓవర్ ఈటింగ్ డిజార్డర్.. బయటపడే మార్గమిదిగో!

lakhmi saranya
ఎక్కువగా ఆహారం తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా అని బయట ఫుడ్ తినటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇటీవల యువతలో, పెద్దల్లో కూడా తినే రుగ్మతలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి కొన్ని సీజన్లలో మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చిపోతే.. సీజనల్ ఓవర్ ఈటింగ్ డిజాస్టర్ గా పేర్కొంటారు. చలికాలం లేక మందిని వేధిస్తుంది. మానసిక ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, గంటల తరబడి స్క్రీన్లముందు కూర్చోవటం వంటివి ఈ రుగ్మతకు కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంకంటే ఎక్కువగా తినటం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు ' ఓవర్ ఈటింగ్ డిజార్డర్' గా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకోలేరు. కొద్దిగానే తినేద్దామనుకోని ప్రారంభిస్తారు కానీ... ఆ సంగతే మర్చిపోయి అతిగా లాగించేస్తుంటారు. కాబట్టి ఈ రుగ్మత ఉన్నవారు అన్నం, ఇతర పదార్థాలు తినేందుకు చిన్న ప్లేట్ వాడడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ ఆహారం పడుతుంది.
దీంతో రెండవసారి వడ్డించుకునేందుకు గ్యాప్ దొరుకుతుంది. మళ్లీ వడ్డించుకోవాలనుకునే సరికి తక్కువగా తినాలి కదా... అనే విషయం గుర్తుకు వస్తుంది. కాబట్టి అంతటితో ఆపేస్తారు. అదే పెద్ద ప్లేట్ అయితే ఒకేసారి ఎక్కువ ఆహారం వడ్డించుకుంటారు. రెండవసారి కూడా అదే జరుగుతుంది. త్వరగా తినడం వల్ల కూడా కొందరు ఆత్రుతలో ఎక్కువగా లాగించేస్తుంటారు. అలా జరగదంటే... స్లోగా తినాలంటున్నారు నిపుణులు. మెల్లిగా తింటూ... ఆహారాన్ని బాగా నములుతూ రుచిని ఆస్వాదించాలి. దీంతో ఎక్కువ సేపు తిన్న ఫీల్ కలుగుతుంది. అలాగే ఆహారం మధ్య మధ్యలో మీరు తాగుతూ ఉంటే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అప్పుడు తక్కువగా తింటారు. సాధారణంకంటే ఎక్కువగా తినటం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు ' ఓవర్ ఈటింగ్ డిజార్డర్' గా మారుతుందని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: