ఈ సీజన్ పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

lakhmi saranya
ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ ని తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. రేగిపళ్ళు అందరికీ ఇష్టం గానే ఉంటుంది. ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. రేగి పండు ఈ సీజన్లోనే దొరుకుతుంది. రేగిపళ్ల సీజన్ రాలే వచ్చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఈ రేగి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. శీతాకాలం సీజన్లో మాత్రమే దొరికే ఈ రేగిపళ్ళను తినడం వల్ల చర్మానికి మేలు చేసి,
అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రేగి పళ్ళు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. రేగి పళ్ళు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా మొటిమలు లేని అందమైన చర్మాన్ని అందిస్తాయి. అలాగే ఎండబెట్టిన రేగి పళ్ళు తినటం వల్ల కాల్షియం, పార్పరస్ శరీరానికి అంది ఎముకలు దృఢంగా మారతాయి. డ్రై స్కిన్ ఉన్నవారు రేగి పళ్ళు తింటే చర్మాన్ని ముదువుగా మార్చేస్తుంది. దీనితో పాటు చర్మం ముడతలు పడకుండా చూసుకుంటుంది. రేగి పళ్ళు తినడం వల్ల శరీరానికి ఒక్కటి పోషకాలు అందుతాయి.
మన శరీరంలో రక్తప్రసరణ హ్యాపీగా సాగాలంటే ఈ రేగి పళ్ళు తినటం చాలా అవసరం. కీళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండు తింటే మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రేగి పళ్ళు అద్భుత ఆహారం. ఎన్ని రేగి పండ్లు నా బరువు పెరగరు. మానవ శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో దాదాపు 18 రకాలు ఒక రేగి పండులో మాత్రమే దొరుకుతుంది. రేగి పళ్ళు తింటే కడుపులో మంట, అజీర్తి, గొంతు నొప్పి, కండరాల నొప్పి తగ్గుతాయి. రేగి పళ్ళు తింటే చాలా రోగాలు మన దరిచేరవు. శీతాకాలం సీజన్లో మాత్రమే దొరికే ఈ రేగిపళ్ళను తినడం వల్ల చర్మానికి మేలు చేసి,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: