చర్మం దురదగా ఉందా... ఈ టిప్స్ ఫాలో అవ్వండి! వెంటనే ఉపశ్రమమం పొందవచ్చు!
మంట, దురదలను తగ్గించవచ్చు. చర్మం మరి ఎక్కువగా దురద లేదా మంటగా ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ మేలు చేస్తాయి. ఒక క్లాత్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోని, కోల్డ్ కంప్రెస్ చెయ్యండి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచితే, దురద తగ్గుతుంది. వేప నూనె చర్మాన్ని రక్షించటంలో సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మం ఎలర్జీలను తొలగించటంలో సహాయపడుతుంది. ఈ నూనెను దురద ఉన్న ప్రదేశంలో రాసి, 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో స్నానం చేయటం వల్ల దురద, మంట, దద్దుర్లు నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. ఇది సీజనల్ వ్యాధులను దరిచేరనివ్వదు. టి ట్రి ఆయిలో ఉండే యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఇన్ఫయేటరి లక్షణాలు ఉంటాయి.
దీనిని వాడటం వల్ల చర్మంపై ఉన్న దురద, మంట తగ్గుతుంది. ఇది చర్మానికి మాశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీన్ని కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని, దురద ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయాలి. అంతేకాకుండా... విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్ కూడా చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మా ఎలర్జీలను దూరం చేస్తాయి. దురద ఉన్న ప్రదేశాల్లో కలబంద గుజ్జును అప్లై చేసి, 15 నిమిషాల తరువాత క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని మాశ్చరైజింగ్ చేసి, మృదువుగా మారుస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి పోషణ అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దురద ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనెను సునితంగా అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.