వాట్.. విషయాలే వెతుకుతున్నారా?.. అయితే సమస్యలు తలెత్తే ఛాన్సెస్ పక్కా..!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్ వాడకాన్ని మరింత ఎక్కువగా వాడుతున్నారు. ఈరోజుల్లో చాలామంది ఒకపూట తినకుండా అయినా ఉండగలరేమో కానీ... మొబైల్ ఫోన్ చెక్ చేయకుండా మాత్రం ఉండలేరు. రోజువారి జీవితంలో అదో భాగమైపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కలగలిసిన సమాచార స్వర్వస్వమే మొబైల్ ఫోన్. ఏమాత్రం ఖాళీ దొరికిన అందులో లీనమైపోతారు. పర్సనల్ వర్క్ అనో, ఆఫీస్ బాధ్యతలనో, టైంపాస్ అనో ఇంటర్నెట్ లో మునిగిపోతుంటారు.
 అయితే ఇక్కడే చాలామంది చిక్కుకుపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం. స్మార్ట్ ఫోన్లలో విషాదకరమైన సంఘటనలు, నేరాలు, హింస, మనసుకు బాధ కలిగించే సమాచారం కంటపడినప్పుడు చాలామంది చదవకుండా ఉండలేరు. అయితే సెర్చింగ్ వ్యసనంగా మారిన ' డూమ్ స్కోలింగ్ ' బాధితులు అంతటితో దానిని వదిలేయరు. అలాంటి విషాదాలు, బాధలు తమకు కూడా సంభవిస్తాయేమోనని ఆలోచిస్తుంటారు. క్రమంగా ఇదొక ఆందోళనగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సెర్చింగ్ సమయంలో బాధాకర సంఘటనలకు సంబంధించిన వార్తలు పలువురిలో చికాకును కలిగిస్తాయి.
 వాటి గురించి మరింత లోతుగా అన్వేషిస్తున్నప్పుడు కోపం, టెన్షన్ వంటివి పెరిగిపోతాయి. ఈ పరిస్థితి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పటికే మెంటల్ ఇష్యూస్ తో బాధపడేవారు భయంకరమైన లేదా ఆందోళన కలిగించే సమాచారం చదివినప్పుడు, వీడియోలు చూసినప్పుడు మరింత టెన్షన్ కు గురవుతారు. దీనివల్ల ఉన్నట్టుండి చమటలు పడడం, గుండె దడ, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఇంకొంతమంది నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ చూస్తుంటారు. క్రమంగా ' డూమ్ స్కోలింగ్ ' వ్యసనం బారిన పడితే గనుక ఈ సమయంలో కూడా విషాద వార్తలను వెతుకుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: