ర‌క్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునే 8 టిప్స్ ఇవే.. !

frame ర‌క్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునే 8 టిప్స్ ఇవే.. !

RAMAKRISHNA S.S.
- ( హెల్త్ & లైఫ్ స్టైల్ - ఇండియా హెరాల్డ్ )
మానవ శరీరంలో హిమోగ్లోబిన్.. ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఆక్సిజన్ శరీరంలో అన్ని అవయవాలకు సక్రమంగా సరఫరా చేస్తుంది. లేకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది పురుషుల్లో 14 నుంచి 18 గ్రాములు.. స్త్రీలలో 12 నుంచి 16 గ్రాములు ఉండాలి. శరీరంలో బలహీనత, అలసట, తలనొప్పి, శ్వాసలో ఇబ్బంది, తల తిరగటం వంటి సమస్యలు వస్తాయి. లోపం రక్తహీనతకు కారణం అవుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి అవయవాలు సక్రమంగా పనిచేయవు. మరియు ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

ఐరన్ బి, విటమిన్లు, విటమిన్ సి వంటి పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమవుతాయి. హిమోగ్లోబిన్ పెంచేందుకు ఎనిమిది రకాల టిప్స్ పాటించాలి.
1) పాలకూర..
పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
2) బీట్రూట్..
బీట్రూట్ లోని నైట్రేట్‌లు ఎర్ర రక్తకణాలు సంఖ్యను పెంచుతాయి. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం మంచి పరిష్కారం.
3) యాపిల్..
రోజు ఒక యాపిల్ తినటం వల్ల హిమోగ్లోబిన్‌ మెరుగవుతుంది.
4) దానిమ్మ..
దానిమ్మలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

5) ఖర్జూరం..
ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.
6) నారింజ..
విటమిన్ సి అధికంగా ఉండే నారింజలు, టమోటాలు వంటి ఆహారాలు ఐరన్ ఉత్పత్తిని పెంచుతాయి.
7) వేరుశనగలు..
ఆకుకూరలు.. పోలిక్ యాసిడ్, శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారీకి అవసరం. వేరుశ‌నగలు, ఆకుకూరలు పోలిక్ యాసీడ్‌కు మంచి మూలాలు.
8) విశ్రాంతి..
ఆరోగ్యంగా ఉండటానికి విశ్రాంతి కూడా చాలా అవసరం. అందుకే కంటి నిండా నిద్రపోవాలి. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవడం ద్వారా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: