దీపావళి పండగకు డ్రై ఫ్రూట్స్ బహుమతిగా అందజేస్తున్నారా?.. అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి..!
ఒక డ్రై ఫ్రూట్స్ అనగానే చాలామందికి పిస్తా, బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు, అంజీర్ పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కల్తీ అవ్వటం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు.. కడుపు సంబంధిత వ్యాధులు, శ్వాస కోస సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే నకిలీ డ్రైఫ్రూట్స్ను ఇలా గుర్తించండి. మార్కెట్లో దొరికే జీడిపప్పు, బాదంలకు ప్రమాదకర రసాయనాలు, కలర్స్ ను నీటి పైన ఓసి అమ్ముతున్నారట. తాజాగా మెరవడం కోసం ఇలా చేస్తున్నారట. కాగా ఈ ఆర్టిఫిషియల్ రంగులు ఎన్నో సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయి.
స్కిన్ అలర్జీ, దగ్గు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఈ కెమికల్స్ జీర్ణ సమస్యల్ని కూడా తెచ్చి పెడతాయి. విరేచనాలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి. కల్తీ జీడిపప్పు కల్తీ అయితే వాసన జిడ్డుగా వస్తుంది. కాగా మార్కెట్లో నకిలీ డ్రైఫ్రూట్స్ను గుర్తించి కొనాలంటున్నారు నిపుణులు. వివిధ రకాల డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా, డ్రై ఫ్రూట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు క్యాన్సర్ నివారణ, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ, బరువు తగ్గటం, బరువు పెరగడం, ఎముకలను బలోపేతం చేయడం మరియు మరెన్నో ఉన్నాయి.