ఈ వంట పాత్రల్లో కుకింగ్ చేస్తున్నారా?.. అయితే ప్రాణాంతక వ్యాధులు రావచ్చు..!

lakhmi saranya
చాలామంది వంట చేసే పాత్రలు అల్యూమినియం పాత్రల్లో చేస్తారు. మరికొందరు మట్టి గిన్నె లేదా రకరకాల గిన్నెలో చేస్తూ ఉంటారు. సాధారణంగా చాలామంది వంటలు అల్యూమినియం పాత్రల్లో చేస్తారు. మరి కొంతమంది స్టీల్, కాపర్, మట్టి పాత్రల్లో కూడా వంట చేస్తుండటం చూస్తుంటాం. అయితే ఈ పాత్రలో పెద్దగా ప్రమాదం ఏం లేకపోయినా.. నాన్ స్టిక్ పాత్రలతో ముప్పు ఉందంటున్నారు నిపుణులు. బ్లాక్ ప్లాస్టిక్ పాత్రల్లో వంట చేస్తే హెల్త్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. రీసెంట్ గా నిపుణులు 203 రకాల వంట పాత్రల్ని పరిశీలించగా..
అనేక పాత్రల్లో బ్రోమిన్ అనే డేంజరస్ రసాయనం ఉన్నట్లు తేలింది. ఎందుకు సంబంధించిన విషయాలను కమోస్పియర్ జర్నల్ లో ప్రచురించారు. టేక్ అవే కంటైనర్లతో పాటు చిన్న పిల్లల బొమ్మలలో కూడా నలుపు రంగు ప్లాస్టిక్స్ ఉన్నట్లు వెల్లడయింది. బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్ లో బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డేంట్స్ అధిక మొత్తంలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పిల్లలలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని.. వీటివల్ల ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ న్యూరో టాక్సిసిటి, క్యాన్సర్, పునరుత్పత్తి పంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు.
వంట కోసం వాడే నాన్ స్టిక్ పాత్రల్లో విషరసాయనాలు ఉన్నాయని కాగా రోజుకు మనిషి బాడీలోకి 34, 700 పిపిఎం రసాయనాలు వెళ్తున్నట్లు అంచనా వేశారు పరిశోధకులు. కాగా ప్రజలు వంట పాత్రల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని... ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు. వీలైనంత వరకు నలుపు రంగు ప్లాస్టిక్ వంట పాత్రలని వాడటం ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు పరిశోధకులు. పిల్లలను కూడా ప్లాస్టిక్ బొమ్మలకు దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నాన్ స్టిక్ పానాల్లో అస్సలు వంట చేయకండి. మట్టి పాత్రలో వంట చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఈరోజుల్లో మట్టి పాత్రలు ఎవ్వరూ వాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: