కార్డియో.. వెయిట్ లిఫ్ట్... ఆరోగ్యానికి ఏ వ్యాయామం మంచిది?

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ వెయిట్ తగ్గటం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు ఎక్కువగా పెరుగుతున్నారు కానీ ఫిట్నెస్ ఉండటం లేదు. ఫిట్నెస్ అండ్ ఫిజికల్ హెల్త్ బై యువతలో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. జిమ్లకు వెళ్లి రకరకాల వ్యాయామాలు ప్రయత్నించేవారు చాలా మందే ఉంటున్నారు. అయితే వీటిలోనూ పలు రకాలు ఉంటాయి. శరీర సౌష్టవానికి, ఆరోగ్యానికి అవసరమయ్యే కసరత్తుల మధ్య తేడా తెలిసి నడుచుకోకపోతే ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అలాగే కార్డియో, వెయిట్ లిఫ్ట్... ఈ రెండిటిలో ఏది మంచిదనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
వ్యాయామాలు అన్నీ మంచివే అయినప్పటికి అతి వ్యాయామాలు మాత్రం తగదు అంటున్నారు నిపుణులు. ఇక స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి కార్డియో ఎక్సర్ సైజ్ కేటగిరిలోకి వస్తాయి. వీటిని ప్రయత్నించడం వల్ల క్యాలరీలు బర్న్ అయ్యి, అధిక బరువు తగ్గటంలో సహాయపడతాయి. రెగ్యులర్గా చేసే వారిలో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. పక్షవాతం, గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. పైగా వీటివల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే కార్డియో వ్యాయామాల వల్ల గుండెకు మంచిది కానీ.. కండరాలు పెంచు కోవాలనుకునే వారికి మాత్రం వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
పైగా సక్రమంగా చెయ్యకపోతే గాయపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఫిట్నెస్ పై ఆసక్తితో జిమ్లలో వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలను చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కండరాల పెరుగుదలకు ఇవి చక్కటి మార్గమని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా జీర్ణ క్రియను మెరుగు పరచడంలో, ఎముకల బలోపేతానికి, శరీరంలో కొవ్వు సైతాన్ని తగ్గించడానికి బరువులు ఎత్తే వ్యాయామాలు సహాయపడతాయి. వీటి వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. కోచ్ లేదా నిపుణుల శిక్షణ లేకుండా ప్రయత్నించటం వల్ల కండరాల్లో నొప్పి, ఎముకలకు గాయాలు వంటివి సంభవిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదే కానీ.. ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి లాభం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: