చిన్న వయసులోనే ఆ సమస్య... వారానికి ముందే గుర్తించాల్సిన 4 లక్షణాలు ఇవే?

lakhmi saranya
చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. గుండె నొప్పి రావడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఎందుకు ఓ కారణం జీవనశైలిలో మార్పులే అని చెప్పుకోవచ్చు.ఒకప్పుడు హార్ట్ ఎటాక్ అనే పేరు రేర్ గా ఎక్కడో ఒక చోట వినిపించేది. ఉదాహరణకు 45 ఏళ్లు మించిన వారికి లేదా వృద్ధులకు గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు యువత కూడా ఈ సమస్య బారిన పడుతుంది. క్యాన్సర్ వల్ల ఎక్కువమంది చనిపోతున్నారని అనుకుంటున్నారు..
 కానీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కన్నా ఎక్కువగా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్న వారు సంఖ్య ఎక్కువ అని రీసెంట్ గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కామన్ గా గుండెపోటు రావడానికి ముందు ఎవరికైనా తీవ్రమైన చాతి నొప్పి వస్తుంది. 20 -30 నిమిషాల కంటే ఎక్కువసేపు వస్తుంది. ఈ నొప్పి చేతులు, గొంతు, దవడ లేదా వీపు కూడా వ్యాపిస్తుంది. అలాగూ చమటలు పడతాయి. శ్వాస తీసుకోవటంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. వికారం, వాంతులు వంటి పలు తక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు వచ్చే వారానికి ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కారణం లేకుండా అంటే...
పూర్తి ఆరోగ్యంతో ఉన్న మెడ, భుజం ఎక్కువగా పెయిన్ రావటం, చాతిలో నొప్పి, దవడ, మెడ, భుజాలలో తీవ్రమైన నొప్పి, అకస్మాత్తుగా జాతి బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. కాగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు వ్యాయామం చేయండి. రాత్రి తప్పకుండా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, దృణధాన్యాలు ఎక్కువగా తినండి. నట్స్, ప్రోటీన్ ఫుడ్స్, నట్స్ ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: