ఈ సంకేతాలు కనిపిస్తే.. జీర్ణ వ్యవస్థలో సమస్య ఏర్పడినట్లే..!

lakhmi saranya
చాలామందికి బయటకు తినటం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ క్రియ అసలు ఆవాదులు. వేడి చేసిన కానీ జీర్ణ వ్యవస్థకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా హెల్తీ ఫుడ్ ని తీసుకోవడం మంచిది. బయట ఫుడ్ ను అస్సలు తీసుకోకండి. బయట ఫుడ్ తినటం వల్ల అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీన వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి, పేగుల్లో వచ్చే ఇబ్బందుల పై అవగాహన పెంచుకొని, అవి తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. మనిషి జీర్ణ వ్యవస్థ... రెండో మెదడు లాంటిది..
 ఇది నిపుణులు చెప్పే మాట. దీన్ని బట్టే చిన్న వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చి అన్న వ్యవస్థ దెబ్బతింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మానసిక సమస్యలు మొదలు.. ఆటో ఇమ్యున్ డిజార్డర్లు, హార్మోన్ల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలు కూడా రావచ్చు. కాబట్టి, జీర్ణవ్యవస్థ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో వచ్చే సమస్యలపై అవగాహన పెంచుకుని, ఇబ్బంది తలెత్తిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం,
తరచూ కడుపునొప్పి వంటివి వేధిస్తున్నాయంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. వెంటనే వైద్యాలను సంప్రదించాలని అంటున్నారు. పేగుల్లో వివిధ రకాల హితకర బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో మార్పులు వస్తే బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొవ్వులు ఎక్కువగా ఉంటే ఆహారాలతో ఊబకాయానికి కారణమయ్యే బ్యాక్టీరియా సంఖ్య పేగుల్లో పెరుగుతుంది. చివరకు ఇబ్బందులు మొదలవుతాయి. జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఉంటే చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. పులిపిర్లు, సోరియాసిస్, దురదలు వంటి ఇబ్బందులు వేధిస్తాయి. పేగుల్లోంచి లీకైయ్యే ప్రోటీన్లను రోగ నిరోధక శక్తి హానికరమైనవిగా భావించి దాడి ప్రారంభిస్తుంది. దీంతో, ఈ సమస్యలు వస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: