చర్మం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు... తప్పక తెలుసుకోవాల్సిందే..!

lakhmi saranya
మన చర్మం సౌందర్యంగా ఉండటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చర్మం సౌందర్యంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తాం. అందుకని ఎక్కువగా సౌందర్యంగా ఉండటానికి చూస్తుంటారు. మన బాడీలో చర్మం అతిపెద్ద అవయవం. శరీరంలోని గుండె, లంగ్స్, కాలేయంలా స్కిన్ కూడా ఒక అవయమే. 2.7 కిలోల నుంచి 4.5 కిలోల వరకు స్కిన్ బరువు ఉంటుంది. బాడీ మీదున్న వైశాల్యం 25 చదరపు అడుగులు. సగటు బరువు 3 కిలోలు ఉండగా... చర్మం బరువు శరీర బరువులో 15 వ వంతు ఉంటుంది. 196 అడుగుల రక్తనాళాలు ఉంటాయి.
అలాగే 645 స్వేద గ్రంథులు, 77 అడుగుల నాడులు, 10 నూనె గ్రంథులు, చర్మం లో ఎన్నో సూక్ష్మ రక్తనాళాలు, ప్రతి గంటకు 6 లక్షల చర్మ కాణాలు మానవ దేహాన్ని విసర్జిస్తుందని అంచనా. స్కిన్ లో కెరటినోసైట్స్, ఫైబ్రోబ్లాస్ట్లు అనే రెండు చర్మ కణాలు ఉంటాయి. ఈ రెండు పొరలతో చర్మం నిర్మించబడి ఉంటుంది. లోపలి భాగాన్ని డెర్మిన్ అని... పై భాగాన్ని ఏపీడెర్మిస్ అని అంటారు. స్కిన్ బాడీ మొత్తంలో ఒక దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మందంగా, కొన్ని దగ్గర అది పల్చగా ఉంటుంది. చర్మాన్ని 3 పోరాలుగా విభజించంతారు.
 చర్మం మన శరీరానికి హాని కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది. క్రిములను బాడీలోకి పోనివ్వకుండా రక్షిస్తుంది. చర్మానికి రక్షణఇచ్చే వాటర్ ప్రూఫ్ గుణం ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు  తోడ్పడటమే కాకుండా... స్కిన్ బాడీకి ఆకృతిని కలిగిస్తుంది. సూర్యరశ్మి నుంచి ఆల్ట్రా వయొలెట్ కిరణాలను గ్రహిస్తుంది. తద్వారా విటమిన్ డి ను రెడీ చేసి బాడీకి అందించడంలో మేలు చేస్తుంది. అవయావాలన్నింటిని వాటి వాటి స్థానాల్లో ఉంచుతుంది. ఒత్తిడి, గాయాల నుంచి భౌతిక, రసానికి పదార్థాల నుంచి చర్మం కాపాడుతుంది. దీనికి సాగి ముడుచుకుపోయే గుణం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: