ఇండియాలోని ఈ నగరాల్లో.. ఒక్కరు కూడా నాన్ వెజ్ తినరు తెలుసా?

praveen
మాకు "ముక్క లేనిదే ముద్ద దిగదు!" అని అంటారా? అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో అస్సలు మాంసం అనేదాన్ని ఛీదరించుకుంటారు అని మీకు తెలుసా? అవును. ఆ నగరాల్లో మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. అవేమిటో ఇపుడు చూసేద్దాం.
శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పబడుతున్న "అయోధ్య"లో మాంసాహారం తినేవారు చాలా తక్కువ. ఈ నగరంలో దాదాపు 80 శాతం మంది మాంసం ముట్టనే ముట్టరు. ఇక మందు గురించి చెప్పాలా? ఇక్కడ మద్యం అమ్మకం కూడా చాలా తక్కువ. అదేవిధంగా శ్రీకృష్ణుడు తిరుగాడిన ప్రాంతం అయినటువంటి "బృందావనం"లో కూడా మాంసాహారం నిషిద్ధం. ఈ ప్రాంతంలో దాదాపుగా అందరూ శాకాహారులే. అందుకే ఆ ప్రాంత ప్రజలు ఎక్కువ రోజులు బతుకుతారని నానుడి. అదే విధంగా నరనారాయణులు తపస్సు చేసిన "రుషికేశ్" ఎంత పవిత్రమైనదో చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ కూడా మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. ఇక జైనులకు పవిత్రమైనటువంటి పాలిటానా, బ్రహ్మ కుమారీస్ ప్రాంతం అయినటువంటి మౌంట్ అబూ, బ్రహ్మ దేవుడి ఆలయంగా పేరు గాంచిన పుష్కర్ నగరాల్లో మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
ఇకపోతే, గాంధీ నగర్ (గుజరాత్)లో మాంసాహారం నిషిద్ధం కానప్పటికీ, చాలామంది నాన్ వెజ్ కి ఇక్కడ దూరంగా ఉంటారు. అయితే మనదగ్గర ఆ పరిస్థితి లేదు. మనకి ఇక్కడ చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఉంటుంది. అందులో మనం కూడా ఉంటాం.. అయితే మాంసాహారులు కంటే, శాఖాహారులే ఎక్కువ కాలం జీవిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు! కాకపోతే అత్యధికంగా ప్రొటీన్‌ కలిగి ఉండడం చేత, చాలామంది తమ ఆహారంలో మాంసాహారాన్ని ఓ భాగం చేసుకుంటారు. ఇక మన దేశంలో మాంసాహారాన్ని 80% ప్రజలు తీసుకుంటే ఫారెన్ కంట్రీలలో మాంసాహారం లేని పట్టణమే మనకి కనబడదు. అందుకే అక్కడే మనకి మాంసాహారం వలన జబ్బులు పడే మనుషులు ఎక్కువగా కనబడతారు. ఈ క్రమంలోనే జరిగిన ఒక సర్వేలో మాంసాహారం తగ్గించమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: