భార్య భర్త అయినప్పటికీ కలిసి పడుకోరు.. ఈ జపనీస్ సాంప్రదాయం వెనుక అసలు రహస్యం ఏంటి..?

lakhmi saranya
మన భారతదేశంలో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కలిసే పడుకుంటారు. కానీ ఈ జపానీస్ వాళ్లు భార్యాభర్తలు విడివిడిగా పడుకుంటారంట. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యా భర్తలన్నాక సహజంగానే ఒకే బెడ్ పై కలిసి నిద్రిస్తారు. ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడో, జలుబు, జ్వరాలు వంటివి వచ్చినప్పుడో విడిగా పడుకుంటారు. కానీ జపాన్లో మాత్రం అలా కాదు. అక్కడి సాంప్రదాయం ప్రకారం దంపతులు ఒకే రూములో పడుకున్నప్పటికీ, ఓకే మంచం మీద మాత్రం కలిసి నిద్రించరు. దీనికి గళా కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం. తినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం...
జపాన్ లో పెళ్లికి ముందు వ్యక్తులు ఎలా నిద్రిస్తారో, పెళ్లి తర్వాత కూడా వారి నిద్ర అలవాట్లు అలానే ఉంటాయి. అలాగని భాగస్వాములు శృంగారంలో పాల్గొనరు అనుకుంటే పొరపాటే. కాకపోతే దేనికి కేటాయించిన సమయం వరకు మాత్రమే ఒకే బెట్ పై ఉంటారట. తర్వాత నిద్రపోయేందుకు వేర్వేరు మంచాల పైకి మారుతారు. పైగా ఇది జపాన్ సంస్కృతి లేదా ఆచారంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. అలాగని దంపతుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండదని భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడి జంటల్లో లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా అధికమే అంటున్నారు నిపుణులు.
 అయితే కచ్చితంగా విడిగా పడుకోవాలని సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా ఎవరూ ఒత్తిడి చేశారు. అది జంటల వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయానికే పూర్తిగా వదిలేస్తారు. కాకపోతే అనాదిగా వస్తున్న ఆచారం గా ఇప్పటికీ చాలామంది దీనిని గౌరవిస్తూ శృంగార కార్యకలాపాల తర్వాత భార్య భార్తలు విడిగా పడుకుంటారు. జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వశాఖ తరపున 2019 లో నిర్వహించిన సర్వేల ప్రకారం 20 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సుగల 1,662 మంది జంటలను నిపుణులు ప్రశ్నించారు. వీరిలో 29.2 శాతం మంది జంటలు మాత్రమే ఒకే ఒడ్ పై నిద్రిస్తున్నారు. మిగతా చాలామంది ఒకే గదిలో పడుకుంటున్నప్పటికీ, నిద్రించే  సమయంలో మాత్రం వేర్వేరు బెడ్లకు మారుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: