వాట్.. జామకాయలు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా.. అయితే తప్పక తినాల్సిందే..!

lakhmi saranya
జామకాయ తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. జామకాయ ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా ఈ జామను తినాల్సిందే. నాచురల్ గా ఇంటిదగ్గర పండే జామ తినటం వల్ల మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. ప్రస్తుత కాలంలో జామకాయకి కూడా మందులు కొట్టి పెంచుతున్న సంగతి తెలిసిందే. మందులు కొట్టి పెంచిన కాయలని అస్సలు తినకండి. నాచురల్ గా పండిన కాయలు తినటం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో జామపండు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి తక్కువ జబ్బు పడేలా చేయటంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ పేషంట్స్ కి కూడా జామ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్. రక్తంలోని చక్కెరను నియంతరించటంలో ఉపయోగపడుతుంది. ఇక జామలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంతరించటంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనానికి ముందు జామను తీసుకుంటే మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు జామను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణం గా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
 అలాగే ఇందులోని ఫైబర్ కంటెంట్ మెరుగైన జీర్ణక్రియను కల్పిస్తుంది. ముఖ్యంగా జీ అన్న సంబంధిత సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాల వృద్దిని ఆడ్డుకోవటంలో జామ ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ కాణాల వృద్ధిని ఆడ్డుకోవటంలో ఉపయోగపడుతుంది. జామ పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా ఆడ్డుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జామను తప్పకుండా తినండి. జామపండు తినటం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి సమస్యకైనా చెక్ పెడుతుంది ఈ జామపండు. కాబట్టి దీనిని తప్పకుండా తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: