జంతువుల కొవ్వు తినడం వల్ల కలిగే లాభాలు అండ్ నష్టాలు ఏంటో తెలుసా..!

lakhmi saranya
చాలా స్వచ్ఛమైన గుడి తిరుపతి. తిరుపతి వెళ్ళిన వారు లడ్డూని తప్పకుండా తీసుకుంటారు. ప్రసాదం కింద భావించి దానిని తింటారు. మరి కొద్ది రోజులుగా తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ. ఏకంగా బీఫ్ ఫ్యాట్ ఆయిల్స్, పంది కొవ్వు కలిసింది అంటున్నారు పలువురు రాజకీయ నాయకులు. రీసెంట్ గా ప్రూఫ్స్ కూడా చూపించారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేసి.... మనోభావాలు దెబ్బతినేలా చేశారు అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అయితే కేవలం జంతువుల కొవ్వు అప పవిత్రమైనదే కాదు..
 హెల్త్ కు కూడా మంచిది కాదని తాజాగా కార్డియాలజిస్టులు  తెలిపారు. జంతువుల కొవ్వుతో నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... జంతువుల కొవ్వు తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొవ్వులో సంతృప్త కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను భారీగా పెంచి ... ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. గుండె అండ్ ఇతర ఆర్గాన్స్ లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. అలాగే కాలేయ పని తీరు దెబ్బతింటుంది. రెడ్ మీట్ లో కూడా సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి.
దీన్ని ఎక్కువగా తింటే మాత్రం దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ ప్రాబ్లెమ్స్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యం పై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీన్ని డైరెక్ట్ తీసుకుంటే హెల్త్ కు మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెడు కొవ్వును కరిగించడంలో మేలు చేస్తుంది. గుండెకు సంబంధించి ఫిష్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. దీన్ని షుగర్స్ తో కలిపినప్పుడే హార్ట్ హెల్త్ పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. కాగా గుండె సమస్యలు పెరుగుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: