చిన్నపిల్లలకి ఏ ఏజ్ లో చెవులు కుట్టించాలో తెలుసా..?

lakhmi saranya
చాలామంది పిల్లలకి 5 నెల వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనేవి కుట్టిస్తారు. మరికొంతమంది ఇంకొంచెం లేటుగా కొట్టిస్తారు. ఆడపిల్లకి చెవులు ఇయర్ రింగ్స్ అందం. అందుకని ప్రతి పిల్లలకి కూడా ఇయర్ రింగ్స్ తప్పకుండా ఉంటాయి. చిన్న పిల్లలకు చెవులు కుట్టేస్తే ఎంతో అందంగా, క్యూట్ గా ఉంటారు. చెవులకు కమ్మలు పెట్టగానే కళ ఉట్టిపడుతుంటుంది. అయితే పిల్లలకు చెవులు కుట్టించటం అనేది తరతరాలుగా వస్తున్నా ఆచారం. బంధువుల్ని ఆహ్వానించి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లలకు తొందరగా చెవులు కుట్టించాలనుకుంటారు.
మరి ఏ వయసులో కుట్టే స్తే మంచిదో తాజాగా నిపుణులు చెబుతున్నారు. పిల్లలకి 6 నెలలు దాటాక టీకాలు ఏమైనా ఉంటే వేయించాలి. తర్వాత 10 నెలల వయసు దాకా ఆగి... అప్పుడు పిల్లలకు చెవులు కుట్టించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. టీకాలు వేసే సమయంలో చెవులు కుట్టించటం వల్ల రోగనిరోధక శక్తి కూడా ఉండదు. సమస్య తీవ్రమవుతోంది. అలాగే చెవులు కుట్టిటప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. సరైన గ్లాజులు ఉపయోగించాలి. కరెక్ట్ ప్లేస్ లోనే చెవులు కుట్టాలి.
లేకపోతే తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెవులు కుట్టించాక పిల్లల్ని ఎక్కువగా ఆటలు ఆడనివ్వకూడదు. బయటకు కూడా ఎక్కువగా పంపించకండి. పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్స్ కు ఎక్కువగా తెలిసి ఉంటుంది. కాగా చెవులు కుట్టే విషయంలో వైద్యుల్ని అప్రోచ్ అయి ... ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. పిల్లలకు సోమ,బుధ, గురు, శుక్ర, శని, ఆదివారములలో చెవులు కుట్టించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కర్ణ వేధ సంస్కారానికి అమావాస్య తిధులు, చతుర్థి, నవమి, చతుర్థి శి తేదీలు తప్ప... అన్ని డేట్స్ శుభప్రదమైనవిగా వెల్లడించారు. ఈ సమయములో చెవులను ఎక్కువగా కుట్టిస్తూ ఉంటారు. చిన్నప్పుడే కానీ పెద్దయ్యాక మాత్రం అస్సలు కుట్టించడం కుదరదు. కాబట్టి ఈ వయసులోనే పిల్లలకి చెవులు కుట్టించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: