ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్ని లాభాలా?.. అయితే కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే..!

lakhmi saranya
చాలామంది ఉదయాన్నే నిద్ర అనేది అసలు లేవరు. నైట్ పడుకునేటప్పుడు లేటుగా పడుకునే మార్నింగ్ మాత్రం అసలు లెగరు. అలా లెగకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదయమునే నిద్రలేవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నైట్ త్వరగా పడుకుని ఉదయమే లేచి ఫ్రెష్ అయితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ కాలంలో ఉదయమునే నిద్రలేవటం అనేది కష్టం. చాలా తక్కువ మంది ఈ పద్ధతి ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై కాన్సంట్రేట్ చేసేవారు మాత్రమే మార్నింగ్ బ్రేక్ అప్ హ్యాబిట్ కలిగి ఉండగా... మిగతావారు లేజీనెస్ తో మధ్యాహ్నం వరకు పడుకుంటారు. అయితే ఇలా చేయటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కోల్పోతారంటున్నారు నిపుణులు. అవేంటో కూడా వివరిద్దాం.
మీరు ముందుగానే లేస్తే పోషకాలు నిండుగా ఉండే అల్పాహారంతో మీ రోజు ప్రారంభించవచ్చు. లేటుగా లేచి బ్రెడ్, వెన్నెతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చే సే బదులు ... ముందుగా లేచి న్యూట్రిషన్లు కలిగిన టిఫిన్ చేయడం ముంచిది. దీనివల్ల రోజంతా సంతృప్తిగా ఉత్సాహంగా ఉంటారు. త్వరగా లేవటం వల్ల ప్రశాంతంగా పని పూర్తి చేసుకునేందుకు సమయం లభిస్తుంది. రెగ్యులర్ గా మార్నింగ్ ఎక్సర్ సైజ్ చేసుకునే టైం దొరుకుతుంది. దీనివల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
 ఆరోజు మరింత చిరుకుగా ఉండేలా ప్రోత్సాహిస్తోంది. ఉదయమునే లేచేవారు ఉదయపు సూర్య కిరణాల లాభాన్ని పొందవచ్చు. దీని విటమిన్ డి సహజ మూలం. కాగా ఎముకల ఆరోగ్యం, మెంటల్ హెల్త్, రోగనిరోధక శక్తి పెరుగుదలకు శరీరానికి చాలా అవసరం. త్వరగా లేచినప్పుడు... రోజు ఎలా గడవాలో , ఏ పనికి ఏ టైమ్ కేటాయించాలి అనేది ప్లాన్ చేసుకునేందుకు అదనపు సమయం ఉంటుంది. ఈ ప్రణాళిక దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. టాస్క లకు టైం ఇస్తూ అన్ని పూర్తయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. మొత్తానికి ప్రోడక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ఎర్లీ రైజర్స్ తరుచుగా మెరుగైన మానసిక ఆరోగ్యం, ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. రోజును ప్రశాంతంగా ప్రారంభించడం, తొందరపడే ఛాన్స్ లేదు కాబట్టి ఒత్తిడి ఉండదు. కాబట్టి రోజంతా సానుకూలంగా ఉండే దినచర్య ఏర్పాటు చేసుకోవడం సులభతరం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: