సముద్రపు నీరు.. ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసా?

praveen
సాధారణంగా మనకు తెలిసిన కొన్ని విషయాల గురించి మనం పెద్దగా పట్టించుకోము. కానీ సోషల్ మీడియాలో అలాంటి ఒక కామన్ విషయం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులోకి వస్తే మాత్రం అలాంటివి తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు ఇంటర్నెట్లో ఎప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు సముద్రం గురించి ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. సాధారణంగా సముద్రం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. బీచ్ లోకి వెళ్లి ఇక సముద్రపు అలలను ఎంజాయ్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు.

 అయితే సముద్రం గురించి అందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందని. కనీసం తాగడానికి కూడా పనిచేయదు అన్న విషయం అందరికీ తెలుసు. ఇక సముద్రపు నీరు పొరపాటున నోట్లోకి వెళ్లిన ఆ ఉప్పుకి యాక్ అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా సముద్రంలోకి నీరు ఎలా వస్తుంది అంటే నదీ ప్రవాహాలు ఎంతో దూరం నుంచి వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. నదుల్లో ఉండే మంచినీరు సముద్రంలోకి రాగానే ఎందుకు ఇలా ఉప్పుగా మారిపోతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఎవరు పెద్దగా ఈ విషయం గురించి పట్టించుకోరు కూడా.

 అయితే మంచినీటితో ఉండే నదులే వచ్చి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రపు నీరు ఉప్పుగా ఉండడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉందట. సముద్రాల్లోని నీరు సూర్యుడు వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఇక ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకుంటూ వస్తుంది. ఇలా చివరికి సముద్రంలో చేరుతుంది. అయితే నీటి గాడత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పుగా అనిపించదు. కానీ సాగరాల్లో లవనాలు ఎటు పోయే దారి ఉండదు.. అంతేకాకుండా సముద్ర అడుగు బాగాన ఉన్న భూమి నుంచి ఎన్నో లవణాలు అటు సముద్రంలో కలుస్తూ ఉండడం కారణంగా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: