ట్రెడ్మిమిల్ Vs జాగింగ్...ఈ రెండిటిలో బరువు తగ్గటానికి ఏది మంచిది..?
కానీ దీనిని నియంతరించడం చాలా ముఖ్యం. ఊబకాయాన్ని తగ్గించుకోవటం శారీరక సౌందర్యాన్ని కాపాడుకోవడమే కాదు, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్థూలకాయం మధుమేహం, హై బీపి వంటి అనేక తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి డైట్, వ్యాయామం చేస్తున్నారు, అలాగే జిమ్ కి వెళ్తున్నారు. అంతే కాకుండా అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. చాలామంది అడపాదడపా ఉపవాసం వంటి వాటిని కూడా అనుసరిస్తారు. అలాగే ఆహారం తీసుకోవటం నియంత్రించడం, నడక, పరుగు, యోగా లేదా జిమ్ కి వెళ్ళటం ఇలా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయటం చాలా ముఖ్యం.
అయితే బరువుతను తగ్గించుకోవటానికి సాధారణంగా జాగింగ్ చేయటం మంచిదా, లేదా ట్రెడ్ మిల్ పై నడవటం మంచిదా అనే విషయాలను మనం తెలుసుకుందాం. బరువు తగ్గటానికి చాలామంది చాలా రకాలుగా నడుస్తుంటారు. ఏ రకమైన శారీరక శ్రమ అయినా ఏ వయస్సు వ్యక్తి అయినా చేయవచ్చు. ప్రత్యేక పరికరాలు లేదా జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. నడక ద్వారా బరువు తగ్గటమే కాకుండా, శరీరానికి అనేక విధానాలుగా ప్రయోజకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా నడవటం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. జీర్ణ క్రియ పెరుగుతుంది. కండరాలను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.