ఆ కోరికలు తీరాలంటే... "బ్రా"లను ఇలా వేస్తే చాలు..!
పురాతన కాలం నుంచి వారి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను ఇప్పటికీ వారి తరాల వారు పాటిస్తూ ఉంటారు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా చదువుకోని వారిలో, గ్రామాలలో, ఆదివాసి గిరిజన సమూహాలలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు అలానే కొనసాగుతున్నాయి. అలాంటి ఓ మూఢ నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా ఇనుప "కంచె"కి బ్రాలు వేలాడదీసి కనిపిస్తుంది న్యూజిలాండ్ దేశంలోని కార్ డ్రోనా ప్రాంతం. ఈ కంచెకి చాలా లోదుస్తులు వేలాడుతూ అందరికీ దర్శనమిస్తుంటాయి. దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. న్యూజిలాండ్ దేశంలోని కార్ డ్రోనా సెంట్రల్ ఒటాగో ఓ అందమైన పర్యాటక ప్రదేశం. చుట్టూ లోయలు, కొండలు, గుట్టలతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రదేశంలో ఓ ఇనుపకంచే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన అమ్మాయిలు తమ ఒంటిపై ఉన్న "బ్రా" ని తొలగించి ఈ కంచెకి తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి మంచి వ్యక్తి భర్తగా వస్తాడని వారి నమ్మకమట. ఈ సాంప్రదాయం మొదట 1999 లోనే వెలుగు చూసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.