పెళ్లి కాకముందు.. నీతా అంబానీ జీవితం ఎలా ఉండేదో తెలుసా..?

frame పెళ్లి కాకముందు.. నీతా అంబానీ జీవితం ఎలా ఉండేదో తెలుసా..?

Divya
ముఖేష్ అంబానీ భార్య .. నీతా అంబానీ అని అందరికీ తెలిసిందే.. అయితే ఇమే అంబానీ కోడలు కాకముందు ఆమె లైఫ్ ఎలా ఉండేది అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ గతంలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఆర్థిక పరిస్థితుల గురించి వివరించింది. ఇటీవల తన కుమారుడు వివాహం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. తన కొడుకు పెళ్లిలో భాగంగా ఈమె కొన్ని లక్షల విలువైన చీరలు ,జువెలరీస్, డైమండ్స్  ధరించి హైలెట్గా నిలిచింది.

1985లో ముకేశ్ అంబానీ నితా అంబానీల వివాహం జరిగిందట. వీరికి ముగ్గురు సంతానం కలరు.. అందులో ఒకరు ఇషా, ఆకాశ్ లు కవల పిల్లలు కాక చిన్న కుమారుడు ఆనంత్ అంబానీ మూడవ కుమారుడట. వీరందరూ కూడా ప్రస్తుతానికైతే లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ ఎంగేజ్ లో ఉన్నప్పుడు నీతా అంబానీ ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇమే ఆరు సంవత్సరాల వయసు నుంచే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకొని చాలా తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్ డాన్సర్ గా పేరు సంపాదించిందట. మొదట్లో ఒక చిన్న స్కూల్లో ఈమె డాన్స్ ఇన్ స్ట్రక్చర్గా పనిచేస్తుందని తెలిపింది.

అలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ నీతా నీ చూశారట. ఆమెను తన కొడుకు ముకేశ్ అంబానీ వివాహం చేసుకుంటారని అడిగారట.. అయితే నీతా మాత్రం వివాహం చేసుకున్న తర్వాత తన పని తాను చేసుకోవడానికి ఓకే చెబితేనే వివాహం చేసుకుంటానని చెప్పిందట. అందుకు ముఖేష్ కూడా ఓకే చెప్పడంతో నీతా తో వివాహం జరిగింది. వివాహమైన తర్వాత కూడా నీతా అంబానీ సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్గా పని చేశానని తెలిపింది. ఈమె మిలినియర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ కూడా తన డాన్స్ స్కిల్స్ ను కాపాడుకోవడానికి నెలకు 800 జీతం ఇచ్చే పాఠశాలల పనిచేసిందనీ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: