రాత్రిపూట పాలు తాగుతున్నారా? అయితే ఈ సమస్య తప్పదు?

Purushottham Vinay

రాత్రిపూట పాలు తాగుతున్నారా? అయితే ఈ సమస్య తప్పదు?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకలకు చాలా మేలు చేస్తుంది. క్యాల్షియం వల్ల ఎముకలు గట్టి పడతాయి.ఇకపోతే మనలో చాలా మంది ఉదయం పూట పాలు తాగితే మరి కొంతమంది రాత్రి పడుకునే ముందు పాలు తాగుతూ ఉంటారు. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందని, అందంగా ఉంటారని చెబుతూ ఉంటారు. మరి నిజానికి రాత్రి సమయంలో పాలు తాగవచ్చా? తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


 పాలలో ఉండే అమైనో ఆమ్లం ట్రిడోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుందట.మెలటోనిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు మనకు  బాగా నిద్రవచ్చేలా చేస్తాయనీ నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రిపూట పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుందట. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా? అంటే కాదనే చెప్పాలి. 
ఎందుకంటె కొందరికీ పాలు సమస్యలను కలిగిస్తాయి. కొన్ని రకాల ఆహారాలకు అలెర్జీ ఉన్నవారు రాత్రిపూట పాలను తాగితే అసౌకర్యంగా ఉంటుంది. ఇది వాళ్ల నిద్రను పూర్తిగా పాడు చేస్తుంది. కాబట్టి పాలు తాగితే అలర్జీలు జీర్ణ సమస్యలు వచ్చేవారు తాగకపోవడమే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు రాత్రిపూట పాలు తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడతాయట. ఇక శరీరంలో ఉండే ప్రోటీన్లు ,కండరాలు ,ఎంజైంలు , పౌష్టిక ఆహారం అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలు  మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీ బరువును పెరగకుండా ఉండటానికి తోడ్పడుతుంది. గోరువెచ్చని పాలు తాగినప్పుడు అది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దానివల్ల ఆకలిగా అనిపించదు. తద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: