పెరుగుని ముఖానికి ఎలా వాడితే అందంగా ఉంటారు?

Purushottham Vinay
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మ సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తాయి.  పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్  మీ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. అందుకే మీరు దీన్ని ప్రతిరోజూ ఉపయోగిస్తే, ఇది మీ చర్మానికి సంబంధించిన దురద, పొడి మరియు చర్మం జిగట వంటి సమస్యలను చాలా ఈజీగా తొలగిస్తుంది. పెరుగు చర్మానికి చాలా మేలు చేస్తుంది కానీ కొందరికి దాని వల్ల మొటిమలు కూడా రావచ్చు. కాబట్టి, వేసవి కాలంలో పెరుగుని మనం రోజూ వాడకుండా ఉండాలి. ముఖ్యంగా మీ చర్మం జిడ్డుగా ఉంటే, పెరుగును అసలు రోజూ రాయకండి.వేసవిలో ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా ముఖంపై చాలా మచ్చలు, మొటిమలు వస్తాయి. దీని కారణంగా, మీ చర్మం నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. పెరుగు ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.


ఇంకా మృతకణాలు క్లియర్ అవుతాయి. అంతే కాదు ముఖంపై మచ్చలు కూడా తగ్గుతాయి.మీ చర్మం పొడిగా మరియు నిర్జీవంగా మారినట్లయితే, మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యలో పెరుగును చేర్చుకోవచ్చు. పెరుగులో ఉండే పోషకాలు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి పని చేస్తాయి. మీరు వేసవిలో మీ చర్మానికి పెరుగును ఉపయోగిస్తే, అది మీ చర్మాన్ని తేమ చేస్తుంది మరియు మీ చర్మాన్ని చల్లబరుస్తుంది.పెరుగు మన చర్మానికి చాలా మేలు చేస్తుంది కానీ దానిని సరిగ్గా ఉపయోగించకపోతే దాని వల్ల ఖచ్చితంగా నష్టాలు ఉండవచ్చు. ముఖ్యంగా మీ చర్మం సున్నితంగా ఉంటే, ఇలాంటి చర్మ సంరక్షణను ఉపయోగించే ముందు, మీరు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు దాని నుండి దురద ఇంకా దద్దుర్లను అనుభవించవచ్చు. ఇంకా అదే సమయంలో, పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం కొంతమందికి హానికరం కావచ్చు. కాబట్టి చర్మానికి సెట్ అయితేనే పెరుగుని వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: