జర్నలిజంలో ఆణిముత్యంలాంటి పత్రిక.. అయ్యో ఇప్పుడు మూతబడిపోయిందే?

లైఫ్ స్టైల్ కథనాలు, హెల్త్ టిప్స్, ఆర్థిక సంబంధ వివరాలతో పాటు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న రీడర్స్ డైజెస్ట్ తన చరిత్రలో ఒక అంకాన్ని ముగించింది. సుమారు 86 ఏళ్ల తర్వాత యూకే ఎడిషన్ ను మూసి వేస్తున్నట్లు ఇటీవల ఆ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎవా మాకేవివ్ లింక్డిన్ లో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మూసివేత గురించి వెల్లడిస్తూ.. ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.

రీడర్స్ డైజెస్ట్ 86 ఏళ్ల అద్భుత ప్రయాణం ముగింపునకు వచ్చింది. ఈ విషయం నన్నెంత గానో ఆవేదనకు గురి చేస్తోంది. ఎనిమిదేళ్ల పాటు ఈ ప్రఖ్యాత సంస్థలో సేవలు అందించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిళ్లు తట్టుకోలేకపోయింది. అని కొద్దిరోజుల క్రితం తన విచారాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని మరుపురానిదిగా మార్చిన సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పలువురు పాఠకులు మేగజైన్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రీడర్స్ డైజెస్ట్ ను దివీట్ వాలెస్, ఆయన సతీమని లిలా బెల్ వాలెస్ 1922లో అమెరికాలో స్థాపించారు. 1938లో యూకేలో దీని కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలు దేశాల్లో దీని మేగజైన్ ప్రచురితమవుతోంది. యూకేకు ముందు చైనా, దక్షిణ కొరియా, థాయ్ లాండ్ సహా పలు దేశాల్లో దీని సేవలు నిలిచిపోయాయి. 1954లో భారత్ లో దీని తొలి ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది.

అయితే రీడర్స్ డైజెస్ట్  నిష్పక్షపాతంగా.. మేధావి వర్గానికి చిరునామాగా, ఆంగ్లం నేర్చుకునే వారికి కార్యదీపికగా..అందమైన ముద్రణ, ఆకట్టుకునే దృశ్య మాలిక, మార్కెటింగ్ సౌకర్యంతో పాటు మంచి సునిశిత హాస్యం, ఆంగ్ల పజిల్ లు, పుస్తకాల పురుగులు అడ్డా వంటి అంశాల మేలవింపుగా ఉండే ఈ మేగజైన్ సేవలు ఇప్పుడు నిలిచిపోయాయి. 17 భాషల్లో ముద్రించ బడి ప్రచురణ ఆగిపోవడం అనేది రీడర్లకు డైజెస్ట్ కావడం లేదు. ముద్రణా రంగం తన ప్రాభవాన్ని కోల్పోతుంది అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: