కిడ్నీలోని రాళ్లు ఏర్పడడానికి కారణం ఇవే..?

Divya
ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని విషయాన్ని ఎక్కువగా వింటున్నాము. మూత్రపిండాలలో రాళ్లు మూత్రపిండాల వైకల్యానికి దారితీస్తాయట.. ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల వల్ల ఇలాంటివి వస్తున్నాయట.అయితే వీటిని ముందుగానే గుర్తించడం వల్ల ఇలాంటి వాటి నుంచి సులువుగా బయటపడవచ్చు.. ముఖ్యంగా కిడ్నీ స్టోన్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మూత్రంలో ఖనిజాలు లవణాలు స్పటికరించినప్పుడు మాత్రమే ఇవి మూత్రపిండాలలో ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి తరచూ ఎక్కువగా నొప్పిని కలిగించేలా చేస్తాయి.

అయితే కిడ్నీలో రాళ్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని ప్రతి సందర్భంలోనూ ఒక కారణాన్ని గుర్తించడం కరెక్ట్ కాదని ప్రముఖ వైద్యులు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా అధిక బరువు ఉండటం శారీరక శ్రమ లేకపోవడం వల్ల తగినంత నీరు తాగకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అధిక పోషకాహార తినడం వల్ల ఇతర పానీయాలు తాగడం వల్ల కూడా కొన్ని కారణాల చేత ఇవి వస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వంశపారపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అయితే వారికి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి ముఖ్య కారణం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం.. ప్యాక్ చేసిన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే ఇందులో ఎక్కువగా ఇబ్బందుల ఎదురవుతాయట పాలకూర బెండకాయ టమోటా మొదలైన ఆహారాలకు చాలా దూరంగా ఉంచడం మంచిది.. ఇందులో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.. వీటితోపాటు జంక్ ఫుడ్ ను కూడా దూరం చేయడం చాలా మంచిది.. మూత్రపిండాలలోని రాళ్లు చికిత్స చేసిన కూడా 90 శాతం మందికి పైగా తగ్గుతాయని మిగిలిన 10 శాతం మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే అలా రావడానికి కనీసం 20 నుంచి 25 ఏళ్ల సమయం పడుతుందట. ఆహారపు అలవాట్లను మార్చుకొని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ కిడ్నీలోని రాళ్ళను ఏర్పరచకుండా చేసుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: