ఎర్ర కలబంద.. ఉపయోగాల పుట్ట...!!
అలాగే ఎర్ర కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరంలో జరిగే ఎటువంటి నష్టం నుండి ఇవి కాపాడతాయి.. అలాగే మన శరీరం పైన ఉండేటువంటి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.. అందుకే ఎర్ర కలబందను కనీసం నెలలో ఒకసారైనా మన శరీరానికి ముఖానికి కూడా రాసుకోవడం మంచిది. నిజానికి ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు రంగు కలబంద చాలా శక్తివంత మైనదట.. అంతేకాకుండా ఈ ఎరుపు రంగు కలబంద జ్యూస్ ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు రంగు కలబంద కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా సహజ సంజీవనిగా కూడా ఉపయోగపడుతుంది. ఎర్ర కలబందలో ఉండే సాలి సిలిక్ యాసిడ్.. పాలి శాఖ రైట్స్ వంటివి కండరాల నొప్పుల నుంచి విముక్తి కలిగించేలా చేస్తాయి అలాగే కండరాల వాపును కూడా తగ్గించేలా చేస్తాయి. ముఖ్యంగా తలనొప్పితో మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.. ఇలా ఇబ్బందితో ఇబ్బంది పడేవారు ఎర్ర కలబందను తలకు పట్టించుకోవడం చాలా మంచిది.. అందుకే ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు రంగు కలబంద ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి..