పుచ్చకాయ వల్ల ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా..!!

Divya
సమ్మర్ సీజన్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కువగా ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మామిడికాయ పుచ్చకాయ తాటికాయలు వంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. ప్రస్తుతం పుచ్చకాయల తినడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం పొందవచ్చు. వేసవి తాపం నుంచి మనకి చల్లదనాన్ని అందించడంలో ఈ పుచ్చకాయ చాలా సహాయపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి అయితే వీటి విత్తనాలను కూడా పలు రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి.

పుచ్చకాయ గింజలలో ఐరన్ ,పొటాషియం ,విటమిన్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయ గింజలను తినడం వల్ల చెమట ఎక్కువ దాహం వంటి లోపాలను సైతం తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడేవారు పుచ్చకాయ రసంలో కాస్త  తేనెను కలుపుకొని తాగడం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది.. మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కాయను ప్రతిరోజు తింటే ఆ సమస్య తగ్గిపోతుంది. ఎక్కువగా నీటి శాతం పెరగాలి అన్నా కూడా కచ్చితంగా ఈ కాయను తింటే సరిపోతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట ఉన్నవారు పుచ్చకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

పుచ్చకాయలోని గింజలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ వంటి వాటికి కూడా రానివ్వకుండా చేస్తుంది. ఈ వేసవికాలంలో కచ్చితంగా విటమిన్-B,పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా ఈ వాటర్ మిలన్ లో ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని కూడా లభించడంలో సహాయపడుతుంది వీటివల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.

పుచ్చకాయ శరీర సౌందర్యానికే కాకుండా వేసవి కారణంగా చర్మం నల్లబారచకుండా ఉండడానికి గుజ్జు వేసుకు రాస్తే మరింత నిగారింపు ఉంటుందట. గుండె జబ్బులు మూత్రపిండాల వ్యాధులు రాకుండా ఉండేందుకు పుచ్చకాయ గింజలు చాలా మేలు చేస్తాయి ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల శరీర పనితీరు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: