పచ్చి మిర్చి ఆరోగ్యానికి ఎంత మేలంటే?

Purushottham Vinay
పచ్చి మిర్చి ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ తాజా పచ్చి మిర్చిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని కలిగించే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌ని తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పచ్చిమిర్చీలో ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.మనం వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చి మిర్చి తింటే గుండె సంబంధిత వ్యాధితో మరణించే అవకాశాలు 44 శాతం ఖచ్చితంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, స్ట్రోక్ నుండి మరణించే అవకాశాలు 61 శాతం తగ్గుతాయట.రెగ్యులర్ గా పచ్చిమిర్చి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పరిమిత పరిమాణంలో మిర్చి తినడం చాలా ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం మొదలుకుని ఎన్నో ఆరోగ్య సమస్యలకు మిర్చి సహకరిస్తుందని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో వెళ్లడయ్యింది. మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ మూలకం.. కారంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. మిర్చిపై ఇటీవలి పరిశోధనలు చేసిన తర్వాత, అది గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మరణించే అవకాశాలను తగ్గిస్తుందని వెల్లడైంది.పచ్చి మిరపకాయల్లో విటమిన్ A, B, C పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, పాస్పరస్ కూడా లభిస్తాయి. మిర్చి ఉత్పత్తి, వినియోగంలోనూ భారత్‌దే మొదటి స్థానం. చాలా మంది మిర్చిని ఇష్టంగా తింటే మరికొంతమంది మాత్రం బాబోయ్ కారం అంటారు. అయితే వంటల్లో రుచిని పెంచే ఈ పచ్చి మిరపకాయ మీ గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.అయితే కేవలం డాక్టర్ల సలహా ప్రకారమే పచ్చి మిర్చి ఎక్కువగా తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: