వీటిని తింటే ఈజీగా సన్నబడతారు?

Purushottham Vinay
మీరు త్వరగా బరువు తగ్గి సన్నగా అవ్వాలనుకుంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా సన్నగా అవుతారు. సన్నగా అవ్వడానికి మీ ఆహారంలో మెంతులు చేర్చుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినే అలవాటును కూడా తగ్గిస్తుంది. రెండూ బరువు పెరగకుండా అడ్డుకుంటాయి.బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచిది. వంద గ్రాముల క్యాబేజీలో 24 కేలరీలు మాత్రమే ఉంటాయి. క్యాబేజీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీకు ఆకలి వేయదు. అలాగే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.దోసకాయలో 100 గ్రాములకు 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో దోసకాయ ఒకటి. దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందుతుంది.


ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో దోసకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది.100 గ్రాముల క్యారెట్‌లో 41 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలోని బీటా కెరోటిన్, లుటిన్ వంటి పోషకాలు కంటి చూపును పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీ ఆహారంలో క్యారెట్లను తినండి.పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, కె పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, ఈ కూరగాయలలో కేలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల పాలకూరలో 26 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన ఫుడ్ లిస్టులో చేర్చుకుంటే బరువు తగ్గడం సులువవుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, కె, జింక్, మెగ్నీషియం, ఐరన్ కూడా అధిక శాతంలో ఉన్నాయి. ఇది రక్తహీనతను నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: