పాలలో ఆవు పాలు మంచివా ..గేదె పాలు మంచివా..?

Divya
ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందికి సైతం ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రహస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు కారణం వారి యొక్క జీవనశైలి అన్నట్లుగా పలువురు వైద్యులు తెలుపుతున్నారు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే ఇలా టైప్-2 మధుమేహం సంభవిస్తోందట. చాలామంది ప్రతిరోజూ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటుంటారు కానీ తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలను సైతం ఇవి పెంచుతుంటాయట. అలాంటి వాటిలో పాలు కూడా ఒకటి పాలలో ఎక్కువగా క్యాల్షియం లభిస్తుంది.
అలాగే ఇందులో కేలరీలు కొవ్వు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి అయితే పాలు రకాన్ని బట్టి ఇందులో క్యాలరీలు కొవ్వు పరిమాణం చేంజ్ అవుతూ ఉంటుందట.. 250 మిల్లీలీటర్ల ఆవుపాలుల దాదాపుగా 160 క్యాలరీలు..7.76 గ్రాముల ప్రోటీన్ 12 గ్రాముల చక్కెర 8 గ్రాముల కొవ్వు ఉంటుందట. ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి.. కనుక గేదె పాలలో 100% ఎక్కువగా కొవ్వు 40% ఎక్కువగా క్యాలరీలు ప్రోటీన్లు సైతం పుష్కలంగా ఉంటాయి.

ఆవు పాలు కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి కనుక ఆవుపాలలో బీటా కెరటిన్ అనే పదార్థం కాస్త ఎక్కువగా ఉంటుంది.. గేద పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల కాస్త తెల్లగా కనిపిస్తాయి. చిన్నపిల్లలకు గేదే పాలకంటే ఆవుపాలే చాలా శ్రేష్టమైనవి. అంతేకాకుండా ఆవు పాలు సులభంగా జీర్ణం అవుతాయి. గేదె పాలలో ఎక్కువగా కొవ్వు ఉంటుంది.. దీంతో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయమే పడుతుంది. ఆవు పాలలో 90 శాతం నీరు శాతం ఉంటుంది కనుక డీహైడ్రేషన్కు గురికాకుండా చేస్తుంది. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలు 10 శాతం ఎక్కువగా ప్రోటీన్ ఉండడం వల్ల పెద్దలకు గేదె పాలు కాస్త మంచివని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: