పరగడుపున ఇలా చేస్తే కొవ్వు ఐస్ లా కరుగుతుంది?

Purushottham Vinay
ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది గుండెపోటు వంటి వ్యాధులకు గురై చనిపోతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ కణాలు, హార్మోన్ల తయారీకి పనిచేస్తుంది. కానీ శరీరంలో దాని స్థాయి పెరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మందుల ద్వారా దీనిని కంట్రోల్‌ చేయవచ్చు కానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే సహజసిద్దమైన పద్దతుల ద్వారా కొవ్వును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.తులసి ఆకులలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే లక్షణాలు జీవక్రియ ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా పని చేస్తాయి. ఇవి శరీర బరువు ఇంకా కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గిస్తాయి.అందుకే ప్రతిరోజూ కూడా పరగడుపున తులసి ఆకులను తీసుకోవచ్చు. ఇందుకోసం మొదట 5-6 ఆకులను బాగా కడిగి పొడిగా చేసుకొని నోట్లో వేసుకొని నమలాలి.మెంతి ఆకులలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి.


అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణీకరించడానికి మెంతి ఆకులను ప్రతిరోజు తినవచ్చు. మీరు సాధారణగా మెంతి ఆకులతో కూర వండుకొని తినవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి నేరేడు చెట్టు ఆకులు బాగా పనిచేస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్, ఆంథోసైనిన్ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది సిరల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. నేరేడు ఆకులను పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు రెండు సార్లు తాగవచ్చు. ప్రతి ఇంట్లో కొత్తిమీర లేనిదే కూర ఉండదు.ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చి తాగవచ్చు లేదా చట్నీ తయారు చేసి తినవచ్చు. ప్రతిరోజు పరగడుపున కరివేపాకు రసం తాగితే కొవ్వు సులువుగా కరుగుతుంది. ఒకవేళ జ్యూస్‌ తాగడం ఇష్టం లేకపోతే 8 నుంచి 10 ఆకులను వంటలో ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: