కర్బుజ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా వదలరు..!!

Divya
వేసవి కాలంలో అధికంగా లభించే సీజనల్ ఫ్రూట్స్ లో కర్బూజా ఒకటి.ఈ పండును చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు.ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.మరియు తియ్యగా ఉండడం వల్ల తొందరగా డైజెషన్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఎలాంటి  అనుమానం లేకుండా ఈజీగా తినేస్తారు.అసలు కర్బుజా తో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినని వాళ్లు కూడా వెంటనే మార్కెట్ నుంచి తెచ్చుకొని తినేస్తారని చెబుతున్నారు ఆహార నిపుణులు.అసలు కర్బూజా తో కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
కర్బూజలో 90% నీటి శాతమే ఉంటుంది.వేసవిలో ఈ పండును తీసుకోవడంతో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.వేసవిలో ఇది శరీరంలోని వున్న అధిక వేడిని తగ్గిస్తుంది.డిహైడ్రేషన్ సమస్య వున్నవారికి కూడా కావాల్సిన తేమను అందించి,చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది.మరియు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
రోజుకో కప్పు కర్బూజ ముక్కలు తీసుకోవడంతో బీటాకెరోటిన్,విటమిన్ సి లభిస్తుంది.దీనితో ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తెరుకునేలా చేస్తుంది.మరియు రోగనిరోధక శక్తిని పెంచి,శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.అంతేకాక రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
కర్బూజ పండులో లభించే విటమిన్ ఎ వల్ల కంటి సంబంధిత సమస్యలను దరి చేరకుండా కాపాడుకోవచ్చు.కర్బూజలో విటమిన్ కె,ఇ వుండటం వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.మహిళలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ పండును వేసవిలో రోజుకొకటి తీసుకోవడం శరీరానికి కావాల్సిన ఫోలెట్ లభిస్తుంది.దీనితో  గుండె జబ్బులు రాకుండా బయటపడొచ్చు.
తరుచూ కర్బూజ జ్యూస్ తీసుకోవడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి,అధిక ఒత్తిడి తగ్గి,నిద్ర బాగా పడుతుంది.అంతేకాక ఇందులో వున్న అధిక పైబర్ కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది.మరియు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
కావున వేసవిలో అధికంగా లభించే కర్బుజా తినకుండా అస్సలు వదలకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: