నిమ్మకాయ ఒక్కటి చాలు ఈ సమస్యలన్నీ మాయం?

Purushottham Vinay
నిమ్మ కాయ ఒక్కటి చాలు ఈ సమస్యలన్నీ మాయం ?

నిమ్మ కాయతో ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దాని ఫలితంగా ఫ్లూ, జలుబుతో బాధపడే అవకాశం ఈజీగా తగ్గుతుంది. నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మరసం మూత్రం పరిమాణం, pH ను పెంచుతుంది. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే డైలీ డైట్ లో విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి రోజువారీ ఆహారంలో ఆరెంజ్ జ్యూస్, స్ట్రాబెర్రీలు, గుడ్లు తీసుకోవడం మంచిది.నిమ్మరసం మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గే విషయానికి వస్తే నిమ్మకాయలకు మించిన మరో ఆప్షన్‌ లేదు. నిమ్మకాయలో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. 


నిమ్మకాయలోని ఫ్లేవనాయిడ్లు జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ కరుకుదనాన్ని తొలగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని రెగ్యులర్‌గా తలకు పట్టించడం వల్ల చుండ్రు నుంచి బయటపడవచ్చు. నిమ్మకాయలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చర్మం కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మం త్వరగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టదు. కణాల గాయం నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో నిమ్మకాయ తీసుకుంటే చర్మం డల్ గా కనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: