వచ్చే రథసప్తమి రోజు చేసే ఈ పనులతో సకల పాపాలు తొలగించుకోవచ్చు .!

Divya
సూర్యుడు లేనిదే జగమే లేదు.అలాంటి సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక ప్రత్యేకంగా సూర్యున్ని కొన్ని రకాల పనులు చేయడం వల్ల సకల పాపాలు తొలగించుకోవచ్చని చెబుతున్నారు వేద నిపుణులు.ఈ రథ సప్తమి మాఘ శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు.అది ఈ నెల అంటే ఫిబ్రవరి 18 న వస్తుంది.మరి ఆ రోజున చేయాల్సిన పనులేంటో,అవి ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి..
రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి,సూర్యుడికి నీటిని సమర్పించాలి.దీన్ని అర్ఘ్యం అంటారు.పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా ఉత్తమం.మరియు ఉదయించే సూర్యుడికి సమర్పించే నీళ్ళలో నువ్వులు మరియు జిల్లేడు ఆకులు వేసి,ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ నీటిని సమర్పించాలి.
బ్రహ్మ ముహూర్తంలో సూర్యునికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు పుష్కళంగా లభిస్తాయి.మరియు స్నానం చేసేటప్పుడు తలమీద ఏడు జిల్లేడు ఆకులు ఉంచి స్నానం చేయడంతో ఏడు జన్మలలో చేసిన పాపాలు తొలుగుతాయని గట్టిగ నమ్ముతారు.సంస్కృతంలో జిల్లేడు ఆకులకి అర్క పత్రాలనీ పిలుస్తారు.అంతే కాక సూర్యుడిని కూడా అర్క అనీ కూడా అంటారు.అందువల్లే సూర్యుడికి జిల్లేడు ఆకులంటే మహా ఇష్టం.
మన దేశంలోని ప్రతి దేవాలయాలలోను రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.ఎవరి జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటుందో,అలాంటి వారు కచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండి,సాయంత్రం పూట ఎర్రటి ఆహార పదార్థాలను దానం ఇవ్వాలి.ఇలా చేయడంతో  సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మరియు ఆ కచ్చితంగా రథసప్తమి రోజు ఆదిత్య హృదయం,సూర్యాష్టకం వంటివి చదవడం వల్ల,అంతా మంచే జరుగుతుంది.
సూర్యుడు రథం విశిష్టత..
సూర్యుడి ఏడు గుర్రాల మీద లోకం అంతా సంచరిస్తూ ఉంటాడు.అలాంటి సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి,పన్నెండు చక్రాలకి,పన్నెండు రాశులనీ భావిస్తారు.ఎలాంటి రాశి దోషాలను పోగొట్టుకోవడానికి అయినా రథసప్తమి రోజున మినుములను,కందిపప్పు, పసుపు,కుంకుమ,ఉప్పు వంటివి దానంగా ఇవ్వడం వల్ల, వారికి సర్వ దోషాలు,సకల పాపాలు నశించిపోయి,అభివృద్ధి పథం వైపు అడిగేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: