ఆరోగ్యానికి మేలు చేసే టేస్టీ రొట్టెలు ఇవే?

Purushottham Vinay
అధిక బరువు ఈజీగా తగ్గడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా సజ్జలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.సజ్జ రొట్టెలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి.పైగా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.వెజ్ మరియు నాన్ వెజ్ కర్రీలతో తినడానికి ఇవి చాలా రుచిగా ఉంటాయి. పైగా ఈ రొట్టెలను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ సజ్జ రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఆ తరువాత ఇందులోనే సొరకాయ తురుము వేసి నీటిని మరిగించాలి. ఆ నీళ్లు మరిగిన తరువాత సజ్జ పిండి వేసి బాగా కలపాలి. తరువాత దీనిని ఒక నిమిషం పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత పిండిని నొక్కుతూ 5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చేత్తో రొట్టెలాగా వత్తుకోవాలి. చేత్తో చేయడం రాని వారైతే చపాతీ కర్రతో నెమ్మదిగా వత్తుతూ రొట్టెలాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ రొట్టెను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి నీటిని చల్లుకుంటూ కాల్చుకోవాలి.తరువాత రొట్టెను రెండు వైపులా పూర్తిగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ రొట్టె కాలడానికి టైం కూడా ఎక్కువగా పడుతుంది. కావాలంటే వీటిలో సొరకాయ తురుమును వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే సజ్జ రొట్టెలు తయారవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: