పొడిదగ్గు వేధిస్తే ఈ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
పొడిదగ్గుతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా తగ్గిపోతుంది.పొడిదగ్గుతో బాధపడే వారు నీటిలో ఉప్పు వేసి కలిపి ఈ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దగ్గుతో పాటు వాపు కూడా తగ్గుతుంది. అలాగే పొడిదగ్గుతో బాధపడే వారు వేడి నీటిలో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పట్టాలి. ఆవిరిని గొంతుతో బాగా పీల్చాలి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే పొడిదగ్గుతో బాధపడే వారు గదిలో ఎల్లప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి.పొడిదగ్గుతో బాధపడే వారు పుదీనా ఆకుల టీని కూడా తీసుకోవచ్చు. గొంతు నరాలకు ఉపశమనాన్ని కలిగించి దగ్గును తగ్గించడంలో ఈ టీని మనకు సహాయపడుతుంది. అలాగే పొడిదగ్గుతో బాధపడే వారు కారాన్ని, ఎండు మిరపకాయలను ఎక్కువగా తీసుకోవాలి. మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించి దగ్గును తగ్గించడంలో కొంతమేర పని చేస్తుంది.పొడిదగ్గుతో బాధపడే వారు గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. తేనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దగ్గుకు కారణమయ్యే క్రిములను నశింపజేయడంలో సహాయపడతాయి.


అలాగే గోరు వెచ్చని నీటిలో పసుపు కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల దగ్గు, ఆస్థమా వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే కఫాన్ని తొలగించి దగ్గును తగ్గించడంలో లికోరైస్ రూట్ టీ మనకు ఎంతో సహాయపడుతుంది. పొడిదగ్గుతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.అలాగే అల్లం నీటిని తాగడం వల్ల కూడా పొడిదగ్గు సమస్య నుండి బయటపడవచ్చు. అల్లం యాంటీమైక్రోబయాల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మం తొలిగిపోతుంది. దగ్గు నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.పొడిదగ్గుతో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగాలి. నీటిని తాగినప్పుడల్లా గోరు వెచ్చని నీటిని తాగాలి. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు గొంతు చికాకు, పొడిదగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.ఇలా పొడిదగ్గుతో బాధపడే వారు ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈజీగా దగ్గు తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: