ఎలాంటి జుట్టు సమస్యలకైనా ఒక్క వాష్ తో చెక్..!!

Divya
జుట్టు రాలడం,చుండ్రు,దురద అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది.విటన్నింటికి పెరుగుతున్న కాలుష్యం,మారుతున్న ఆహారపు అలవాట్లు,జీవన శైలి వంటి కారణమని చెబుతున్నారు.చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా,జుట్టు రాలుతోందని ఏవేవో ఖరీదైన నూనెలు,షాంపూలు యుజ్ చేసి,వారి సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు.అయితే రాలిపోతున్న జుట్టును చూసి బాధపడటం మానేసి,దాని నివారణ మార్గాలను ఎంచుకోవాలి.ఇక కెమికల్స్‌తో కూడిన నూనెలు, షాంపూలకు బాయ్ చెప్పి ప్రకృతి సిద్ధమైన సహజ చిట్కాలు పాటిస్తే హెయిర్ సమస్యలను పోగొట్టుకోవచ్చు.మరియు తక్కువ ఖర్చు కూడా.అవేంటో ఇప్పుడు చూద్దాం రండీ..
దీనికోసం ముందుగా కుంకుడుకాయలను తీసుకొని, ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి.ఈ గిన్నెలోకి ఐదు నుంచి ఆరు మందారపు ఆకులు,ఒక టేబుల్ స్పూన్ మెంతులు, గుప్పెడు గుంటగలగరాకు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.ఎప్పుడైతే తల స్నానం చేయాలి అనుకుంటూ ఉంటారో అలాంటివారు ముందుగా గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి.మర్దన కోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వాడుకోవడం ఉత్తమం.వేడి చేసిన నూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేసి మునివేళ్లతో మెల్లగా మసాజ్ చేయాలి.దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి,జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.దీని ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ నూనెను అప్లై చేసి గంట వరకు అలాగే ఉంచి,ఆ తరువాత రాత్రి నానబెట్టుకున్న వాటిని మెత్తగా పిసికి, అ మిశ్రమంతో తల స్నానం చేయాలి.కానీ ఇందులో ఎలాంటి కెమికల్ కల్పిన షాంపూలను అసలు యూస్ చేయకూడదు.మంచి రిజల్ట్ ని ఒక్క ఒకే ఒక్క వాష్ లోని గమనించుకోవచ్చు.
సాధారణంగా కుంకుడుకాయలు నాచురల్ షాంపూగా పనిచేస్తాయి.చుండ్రు,దురదకు చెక్ పెట్టడంలో కుంకుడు కాయలు ముందు ఉంటాయని చెప్పవచ్చు.పైన చెప్పిన పదార్థాలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు చుండ్రును నివారించడానికి అద్భుతంగా సహాయపడతాయి.మరియు కుదుళ్లు దృఢంగా తయారవడానికి సహాయపడటమే కాక, మెలనిన్ ఊత్పత్తి జరిగి జుట్టు గ్రే హెయిర్ కూడా నల్లబడుతుంది.
కావున మీరు కూడా ఈ జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ షాంపూ వాడి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: