పాపం.. ఆ ఊరంతా బ్యాచిలర్సే.. ఎందుకంటే?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది  అందుకే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి పెళ్లి అనే బంధం లోకి అడుగు పెట్టాలని ఎంతోమంది యువకులు ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎన్నో కలలు కంటూ ఉంటారు. సినిమాల్లోనే మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఇలా అందరూ యువకులు పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అని చెప్పాలి. అయితే ఒకవేళ వయస్సు పెరుగుతున్న పెళ్లి కాకపోతే ఇక ఎంతోమంది నిరాశ చెందుతూ ఉంటారు.

 చివరికి పెళ్లికాని ప్రసాద్ గా మిగిలిపోతామేమో అని భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే అక్కడక్కడ కొంతమంది యువకులకు ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. కానీ ఈ ఊర్లో మాత్రం అలా కాదు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఊరంతా పెళ్లి కానీ ప్రసాదులే. అందరూ బ్యాచిలర్లు గానే మిగిలిపోయారు. ఒక్కరికి కూడా పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. అదేంటి అక్కడ ఎవరు పని పాట లేకుండా జులయ్ గా తిరుగుతారా.. అందుకే పిల్లను ఇవ్వడం లేదా అంటారా.. పని పాట లేకుండా తిరగడం కాదు.. బాగా చదువుకొని జాబ్ సాధించిన ఆ ఊరి యువకులకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఎవరు. ఇలా ఆ ఊర్లో అందరూ కూడా పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోవడానికి వెనుక పెద్ద కారణమే ఉంది.

 ఏకంగా ఆ ఊరికి మౌలిక వసతులు లేకపోవడమే.. బీహార్ లోని బారువాన్ కాల గ్రామం బ్యాచిలర్స్ విలేజ్ గా మారిపోయింది. ఈ ఊరిలో ఏ వీధి తిరిగినా కూడా పురుషులే దర్శనమిస్తూ ఉంటారు  అది కూడా పెళ్లికాని బ్యాచిలర్ సే ఎక్కువగా ఉంటారు. పాట్నా నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం కైమూరు కొండల్లో ఉంది. అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం లేదు. కనీసం గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. దీంతో మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇక గత 50 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంది అన్నది తెలుస్తుంది. చివరగా 2017 లో ఒక యువకుడికి పెళ్లి జరగగా అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క పెళ్లి కూడా జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: