ఒక్క బెల్లంతో ఇన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చా..?

Divya
పూర్వకాలంలో కాఫీ టీ లలో కానీ ఏదైనా తీపి పదార్థాలు చేసుకోవాలంటే వాళ్లకు గుర్తొచ్చేది ముందుగా బెల్లం మాత్రమే. ఎందుకంటే అప్పుడు పంచదార తయారీ లేదు కనుక. కానీ ఈమధ్య చాలామంది ఫ్యాషన్ గా మరియు తొందరగా పని అయిపోతుంది అని చక్కెర వాడడం ఎక్కువయ్యింది.కానీ దీని వల్ల ఎన్నో రకాల జబ్బులు కూడా కొని తెచ్చుకుంటున్నారు దీని బదులుగా బెల్లం వాడడమే ఉత్తమం అని చెబుతున్నారు.బెల్లంని వాడడం వల్ల నోటికు రుచిగా ఉండటమే కాకుండా అనేక రోగాలకు దరిచేరకుండా కాపాడుతుందని కూడా చెబుతున్నారు.మరి బెల్లం మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
పంచదారకు వదల కాఫీ,టీ లలో బెల్లం ఉపయోగించడం వల్ల,బెల్లంలోని పీచు పుష్కలంగా లభిస్తుంది.ఇది జీర్ణాశయానికి సాయపడుతూ,గ్యాస్, మలబద్ధకాన్ని పోగొడుతుంది.ఇందులోని జింక్‌, సెలీనియం ఒంట్లోని వ్యర్థాలను వదిలించే డీటాక్స్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాక కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
 అంతేకాక చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు,జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది.ఇలాంటి కఫ సంబంధ వ్యాధులకు చెక్‌ పెట్టి,ఊపిరి తిత్తులకు దృఢంగా తయారు చేస్తుందనీ చెబుతారు.దీని కోసం చలికాలంలో గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో,ఒక స్ఫూన్ బెల్లం వేసి రోజూ ఉదయాన్నే త్రాగాటంతో జలుబు,దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు దరి చేరవు.
మరియు బెళ్ళానికి ఒంటిని చల్లబరిచే గుణం కూడా ఉంటుంది.అందుకే వేసవిలో ఎక్కువగా బెల్లం పానకం తాగమని చెబుతారు.అంతేకాక వేసవి మొదలవగానే వచ్చే శ్రీ రామనవమికి పానకం తాగటం ఓ సంప్రదాయంగా కూడా మార్చారు.మరియు బెల్లంతో పాటు కాస్త అల్లం,నువ్వులు,నెయ్యి కలిపి చేసిన స్వీట్ అమృతంతో సమానమని చెబుతారు. దీనిని తరుచూ తీసుకోవడంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతారు. దానితో పాటు ఐరన్‌ లాంటి పోషకాలూ అందుతాయి.
ఐరన్ అధికంగా లభించడంతో రక్తపోటును తగ్గించడం,రక్తాన్ని శుద్ధి చేయడం,కడుపుబ్బరాన్ని నియంత్రించే స్వభావమూ బెల్లానికి ఉంది.భోజనం తర్వాత స్వీట్ తీసుకునే అలవాటు వున్నవారు బెల్లం నోట్లో వేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: