పాములు పదేపదే నాలుకను.. ఎందుకు బయటకు తీస్తాయో తెలుసా?

praveen
ఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఒకటి ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా చిన్నగా కనిపించే పాములు ఆరడుగుల మనిషిని కూడా ఒక్క కాటుతో చంపేయగలవు. అందుకే పాములతో మనుషులు ఎప్పుడూ కాస్త జాగ్రత్తగానే ఉంటారు అని చెప్పాలి. అయితే పాముల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక కొన్ని విషపూరితం కాని పాములు ఉంటే ఇంకొన్ని మాత్రం ఇక విషపూరితమైన పాములు ఉంటాయి.

 అయితే ఇలా విషపూరితమైన విషపూరితము కానీ పాములలో మాత్రం ఒకే ఒక లక్షణం కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఏకంగా పాము జాతి చెందిన ప్రతి జీవి కూడా నాలుకను తరచూ బయటకు తీస్తూ ఉంటుంది. అయితే ఇలా పాములు ఎందుకు నాలుకను బయటకు తీస్తాయి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు కూడా. కానీ పాములు ఇలా నాలుకను బయటకు తీయడం వెనక పెద్ద కారణమే ఉందట. అయితే ఆ కారణం ఏంటో తెలిస్తే మాత్రం ఇక పాములకు మరింత దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు అని చెప్పాలి.

 పాము తన నాలుకను పదేపదే బయటకు తీయడానికి కారణం నాలుక సహాయంతో బయట వాతావరణాన్ని రుచి చూస్తున్నట్లు అర్థమట. ఇలా పసిగట్టడం ద్వారా చుట్టుపక్కల వాతావరణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందట. పాము ఇక తన చుట్టూ ఉన్న ఉన్న ప్రాంతాలలో ఏ జీవి ఉందొ తెలుసుకోవాలని పాము అనుకుంటూ ఉంటుంది. అయితే పాములకు వినడం చూడగల సామర్థ్యం కాస్త బలహీనంగా ఉంటుంది. ఏ శబ్దాన్ని సరిగ్గా వినలేదు. ఒక పాము ముందర వేణువు వాయిస్తుంటే అది చూసిన క్షణంలో అటువైపు దూసుకుపోతూ ఉంటుంది.

 అయితే వినడం చూడడం విషయంలో సామర్థ్యం బలహీనంగా ఉన్నప్పటికీ అటు వాసన పసిగట్టడం విషయంలో మాత్రం పాములు ఎంతో షార్ప్ గా ఉంటాయట. ఏకంగా తమ చుట్టూ ఉన్న మాంసాహారాలను గుర్తించేందుకు తరచూ నాలుకను బయటికితీస్తూ ఉంటాయట పాములు. పాము నాలుకను బయటకు తీసినప్పుడు అది గాలిలో తేలియాడే చిన్న తేమ కణాలలో ఉండే వాసనలను సేకరిస్తుందట. ఇక తర్వాత వాటి నోటి ఎగువ భాగంలో ఉండే జాకబ్సన్ ఆర్గాన్ అనే అవయవంలోకి నాలుకను చొప్పిస్తుంది. నాలుక కణాలను ఈ అవయవంలోకి పంపించిన వెంటనే అది మెదడుకు సందేశాన్ని పంపిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులను వెంటనే అర్థం చేసుకోగలుగుతాయట పాములు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: