పళ్ళు ఆరోగ్యంగా మెరిసే టిప్స్?

Purushottham Vinay
టీ,కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లు ,కొన్ని మందులు దంతాలను పసుపురంగులోకి మారటానికి కారణమౌతాయి.కాబట్టి వాటిని మానేయాలి.స్ట్రాబెర్రీలు మాలిక్ యాసిడ్‌ను కలిగి ఉంటాయి. మాలిక్ యాసిడ్ దంతాలపైన పసుపు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు తెల్లబడటానికి దోహదం చేస్తుంది.యాక్టివేటెడ్ చార్‌కోల్ కలిగిన దంత ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మరకలను తొలగించుకోవచ్చు. బొగ్గు యొక్క శోషక లక్షణాలు దంతాలను ప్రకాశవంతంగా మార్చటంతోపాటు, దంతాలపైన మరకలను తొలగించడంలో సహాయపడతాయి.బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పపైన్ దంతాలపై పసుపు మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. దంతాల తెల్లబడటానికి సహాయపడుతుంది.బ్యాక్టీరియాతోపాటు దంతాలపై మరకలను తొలగించడానికి, కొబ్బరి లేదా నువ్వుల నూనెను 15-20 నిమిషాలు పుక్కిలించాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రపరచడం ద్వారా దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నోటి ఆరోగ్యం కోసం అవసరం అనుకుంటే దంతవైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు ,సలహాలు పాటించాలి.పైనాపిల్స్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి దంతాలు తెల్లబడటంలో సహాయపడుతుంది.


బ్రోమెలైన్ దంతాలపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.పైనాపిల్స్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీల వంటి పండ్లలో ఎంజైమ్‌లు, తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి, ఇవి మరకలను తొలగించి దంతాలను తెల్లగా మారేలా చేస్తాయి.పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి. ఈ ఆహారాలను నమలడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన లాలాజల ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. నోటిలోని ఆమ్లాలను తటస్థీకరించడంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. నోటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేందుకు పీచు పదార్దాలు సహాయం చేస్తాయి.రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం వల్ల దంతాలపై పసుపు మచ్చలను పోగొట్టుకోవచ్చు. దంతాలు శుభ్రపడటంతోపాటు మంచి చిరునవ్వును సొంతం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే మరకలు తొలగిపోతాయి. గారపట్టటం నిరోధించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: