వావిలాకు వాడితే వందరోగాలకు రెడ్ లైట్ పడ్డట్టే..!

Divya
మన శరీరంలో వాత, పిత్త కఫ దోషాలు తొలగించుకుంటే, వంద రోగాలు తొలిగినట్టే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.ఇలాంటి రోగాలను పారద్రోలడానికి,ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి.అటువంటి కోవలోకి వస్తుంది వావిలాకు. ప్రకృతిలో సహజంగా లభించే వావిలాకితో వందరంగా రోగాలునైనా పోగొట్టుకోవచ్చు అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.అసలు వావిలాకు ఎలా వాడాలో,ఎలాంటి రోగాలకు నయం చేస్తుందో మనం తెలుసుకుందాం పదండీ..
పూర్వకాలంలో వావిలాకును బాలింత ఆకు అనేవారు. వీరు తొందరగా కోలుకోవడానికి నీటిలో వావిలి ఆకుల‌ను వేసి,బాగా ఊడికించి,ఆ నీటితో బాలింత‌ల‌కు స్నానం చేయించేవారు.ఇలా చేయ‌డం వ‌ల్ల బాలింత‌ల‌కు ఒంటి నొప్పులు త‌గ్గి,తల్లి పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
సాధారణంగా నీలి వావిలి చెట్టు,తెల్ల వావిలి చెట్టు ఆకులు ఎక్కువగా లభిస్తాయి.తెల్ల వావిలి చెట్టుకు వేడి చేసే గుణం కలిగి ఉంటాయి.వీటిని వాడటం వల్ల ప‌క్ష‌వాతం,క‌టివాతం మొద‌లైన వాత రోగాల‌తోపాటు ద‌గ్గు,ఆయాసం వంటి క‌ఫ రోగాల‌ను న‌యం చేసే గుణం వావిలి చెట్టుకు ఉంటుంది.మరియు పొట్టలోని క్రిముల‌ను చంపే శ‌క్తి ఉంటుంది.ఇప్పుడున్న కాలంలో చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు బాధ‌ప‌డుతున్నారు.ఈ నొప్పులను తగ్గించడానికి చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ ను వాడుతున్నారు.వీటిని వాడ‌డం వ‌ల్ల దుష్ప‌భ్రావాలు అధికంగా ఉంటాయి.అలా కాకుండా నొప్పులతో బాధపడేవారికి వావిలాకును ఉడకబెట్టి నొప్పి వున్నచోట పట్టులా వేస్తే చాలు,ఒక్కరోజులో నొప్పికి ఉపశమనం కలుగుతుంది.
సీజన్ చెంజెస్ వల్ల జలుబు, దగ్గు సర్వ సాధారణం.ఇలా తీవ్రంగా జ‌లుబు చేసిన‌ప్పుడు,వావిలి ఆకుల‌ను మరియు యూక‌లిప్ట‌స్ ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి, ఆ నీటితో ఆవిరి పట్టుకోవ‌డం వ‌ల్ల తొందరగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఆ వావిలి చెట్టులో ఆకు నుంచి కాండం వరకు ప్ర‌తి భాగం అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.అంతేకాక జ్వరం,త‌ల‌నొప్పి,కాలేయం,గుండె సంబంధ‌మైన స‌మస్య‌ల‌ను త‌గ్గించే శ‌క్తి వావిలి చెట్టు పువ్వులకు ఉంటుంది.కీళ్ల నొప్పుల‌ను,కీళ్ల వాపుల‌ను, కండ‌రాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ ఆకులు చాలా బాగా స‌హాయ‌ప‌డ‌తాయి.కావున ఈసారి వావిలాకు కనబడితే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: