సర్జరీ చేయించుకుంది.. ఇప్పుడు మగ బిడ్డకు తండ్రి అయింది?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక కూర్చున్న చోటునే అరచేతిలో ఉన్న మొబైల్ లోప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో మొబైల్ లో వాలిపోతోంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఎక్కడ ఏం జరిగినా అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఆసక్తికరమైన ఘటనలు అందరు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక అలాంటి విషయాల గురించి తెలిసి కొంత మంది ఆశ్చర్యపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వైరల్ గా మారిపోయింది.

 ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రేమను గెలిపించుకోవడానికి ఏకంగా లింగ మార్పిడి చేసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి లింగ మార్పిడి అనేది కేవలం సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించడానికి కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించేది. ఇక ఇటీవల కాలంలో నిజ జీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయ్. ఏకంగా ప్రియమైన వారి కోసం లింగ మార్పిడి చేసుకునేందుకు కూడా సిద్ధం అయిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఏకంగా ప్రేమను గెలిపించుకోవడానికి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒక మగ బిడ్డకు తండ్రి అయింది ఆ లేడీ కానిస్టేబుల్.

 మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న మగ బిడ్డకు తండ్రి కాగలిగింది పురుషుడిగా మారిన లేడీ కానిస్టేబుల్. ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నుంచి అనుమతి సాధించగలడంతో లలిత సాల్వే అనే లేడీ కానిస్టేబుల్ 2018 లో ఇలా పురుషుడిగా మారెందుకు సర్జరీ చేయించుకుంది. 1988లో పుట్టిన ఆమె 2010లో మహిళా కానిస్టేబుల్ గా ఎంపిక అయింది. అయితే శరీరంలో మార్పులు వస్తున్నట్లు 2013లో గుర్తించింది. వైద్య పరీక్షలు చేయించుకోగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోములు ఆమెలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించగా.. 2018లో మూడు శస్త్ర చికిత్సల ద్వారా ఇలా మహిళల నుంచి పురుషుడిగా మారింది. లలిత్ గా పేరు మార్చుకుంది. అయితే సీమ అనే మహిళను పెళ్లి చేసుకోగా.. ఇటీవలే లలిత్ ఏకంగా మగ బిడ్డకు తండ్రి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: