మైగ్రేన్ సమస్య తో ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదా..!!
ఇలా ఒకవైపు తలనొప్పితో ఇబ్బంది పడేవారు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండడమే మంచిదంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాంటి వాటిలో పులియబెట్టిన ఆహారం తినకూడదట. ఇందులో థైరా మెన్ అనే పదార్థం ఉంటుందట.. దీనివల్ల మైగ్రేన్ అనేది చాలా పెరిగిపోతుంది వీలైనంతవరకు ఇలాంటి ఆహారాలని దూరంగా ఉంచడమే మంచిది.
ఆల్కహాల్ లో ఇథనాల్ అనే పదార్థం ఉండడం వల్ల మైగ్రీన్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇది మన శరీరంలోకి వెళ్ళగానే ఒక రసాయనంగా మారుతుందట. దీనివల్ల మైగ్రేన్ సమస్య అనేది చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. అందుకే మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.
చల్లగా ఉండే ఎలాంటి పదార్థాలను కూడా మైగ్రేన్ సమస్యతో ఉన్నవారు తీసుకోకూడదు. ఇవి ఎక్కువగా చల్లదనాన్ని చేసి తీవ్రమైన నొప్పిని సైతం కలిగిస్తాయట. అందువల్లే వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది తలనొప్పి వస్తే ఖచ్చితంగా టీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కువగా కెఫిన్ పదార్థం ఉండడం వల్ల ఇది మైగ్రేన్ సమస్యను తీవ్రం అయ్యేలా చేస్తుంది.. కాబట్టి టీ కాఫీలు చాక్లెట్లు ఇతరత్రా వాటిని దూరం చేయడమే మంచిది. అయితే ఇలాంటి సమస్య రాగానే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.