ఈ టీ తాగితే ఏ జబ్బు రాదు?

frame ఈ టీ తాగితే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
ఈ చలికాలంలో వేడి వేడి టీ ఓ కప్పు తాగితే ఆ మజానే వేరుగా ఉంటుంది. కప్పు టీ తాగడం వల్ల రోజంతా అలసట, ఒత్తిడి చిటికెలో మాయం అవుతుంది. టీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఎందుకంటే టీలో కెఫిన్‌, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రించి, జీవక్రియ రేటును బాగా మెరుగుపరుస్తాయి. దీంతో బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.కాలేయం నుంచి విషపదార్ధాలు ఈజీగా తొలగించి, కొవ్వును కరిగించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడే చాలా కారకాలు టీలో ఉన్నాయి. టీ వల్ల చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బరువు తగ్గించే ప్రక్రియలో గ్రీన్ టీ ఎల్లప్పుడూ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుందని దాదాపు 11 అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గుతారు. చాలా మంది ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్రపోరు.అయితే ఇది క్రమంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చమోమిలే టీని తాగారంటే చాలా హాయిగా నిద్రపడుతుంది.ఇంకా అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.


మన శరీరంలో మెటబాలిజం మెరుగుపడటం వల్ల బరువు తగ్గడం కూడా తేలికవుతుంది.కాబట్టి వేడి నీటిలో అల్లం వేసి కాసేపు మరిగించి అందులో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అల్లం - నిమ్మరసం టీలో విటమిన్లు ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆకలిని ఈజీగా తగ్గించి, కొవ్వు కరిగించడంలో బాగా సహాయపడతాయి.పాలు, పంచదార లేకుండా డికాషన్‌ టీ తాగినా బరువు ఈజీగా తగ్గుతారు. ఈ బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: