ఈ అలవాటు ఉంటే త్వరగా చనిపోతారు?

Purushottham Vinay
ఈ అలవాటు ఉంటే త్వరగా చనిపోతారు?

నేటి కాలంలో చాలా మంది కూడా రాత్రిపూట తక్కువగా నిద్రపోతున్నారు. ఇది ఖచ్చితంగా చాలా ప్రమాదకరం. దీనివల్ల భవిష్యత్లో ఖచ్చితంగా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి నిద్రని చాలామంది పట్టించుకోరు. వాస్తవానికి విటమిన్ల లోపం ఉంటే నిద్రపట్టదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.నిజానికి నిద్ర అనేది చాలా గొప్ప ఔషధం. దీనివల్ల శరీరం రిలాక్స్తో పాటు రీఛార్జ్ కూడా అవుతుంది. మంచి నిద్ర పోతున్న వ్యక్తులకు అసలు ఎలాంటి రోగాలు దరిచేరవు. కానీ నేటికాలంలో చాలామంది కూడా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం విటమిన్ డి లోపం ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని లోపం వల్ల నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర పట్టదు. మంచి నిద్ర కోసం మెలటోనిన్ హార్మోన్ అనేది సరిపడంత ఉండాలి. 


శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ -డి అనేది ప్రధాన వనరు. మన శరరంలో విటమిన్-డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.దీని కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.అలాగే విటమిన్- డి లోపంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే శరీరం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. దాని కారణంగా నిద్రపట్టదు.నిద్రలేమి సమస్యను అధిగమించడానికి విటమిన్- డి అధికంగా ఉన్న ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మిలో కొద్దిసేపు తిరగాలి. పుట్టగొడుగులు , గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ రసం ఇంకా సముద్రపు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా దీనితో పాటు ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు సరైన సమయంలో పడుకునే అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: