కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఇవే?

Purushottham Vinay
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ మనకు చాలా బాగా సహాయపడుతుంది. రెటీనాలో రోడాప్సి ఉత్పత్తిని పెంచి కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్ ఎ మంచి పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ ఎక్కువగా చీజ్, కోడిగుడ్లు, చేపలు, పాలు, పెరుగు, కాలేయం, క్యారెట్ ఇంకా ఆకుకూరలు, వంటి ఆహారాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఎ లభిస్తుంది. అందువల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. అయితే ఈ విటమిన్ ఎ ను పురుషులు రోజుకు 700 మైక్రోగాములు ఇంకా స్త్రీలు 600 మైక్రో గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇంకా అలాగే కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో విటమిన్ సి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిమ్మజాతికి చెందిన పండ్లల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది.ఈ పండ్లల్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను ఈజీగా నశింజేస్తాయి. అందువల్ల వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నారింజ పండ్లను తినడం, నారింజ పండ్ల జ్యూస్ తాగడం అలాగే స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ ఇంకా బ్రొకోలి వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభించి కళ్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.అలాగే కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్ లో విటమిన్ ఇ కూడా ఒకటి.కంటిపొరలు ఇంకా మ్యాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా చేయడంలో విటమిన్ ఇ మనకు ఎంతగానో సహాయపడుతుంది.


విటమిన్ ఇ ఎక్కువగా బాదంపప్పు, చియా విత్తనాలు ఇంకా పొద్దుతిరుగుడు గింజలల్లో ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక కంటికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడకుండా చేసి కంటికి రక్తాన్ని చక్కగా సరఫరా చేయడంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ కె మనకు బాగా సహాయపడుతుంది. ఈ విటమిన్ కె ఎక్కువగా పాలకూర, తోటకూరతో ఇతర ఆకుకూరల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. రోజూ ఏదో ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే కళ్లు పొడిబారకుండాఇంకా కళ్లల్లో తగినంత తేమ ఉండేలా చేయడంలో మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సహాయపడతాయి.అలాగే ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల వయసుపైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: