ఇద్దరూ ఇష్టపడినా.. సెక్స్‌కు ఆ వయస్సు మస్ట్?
స్మార్ట్ ఫోన్ వినియోగం, సినిమాలు, చుట్టూ పరిస్థితుల వల్ల లైంగిక నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లా కమిషన్ పోక్సో చట్టాన్ని తీసుకు వచ్చింది. అయితే కొన్ని కేసుల్లో 18 ఏళ్ల లోపు అబ్బాయిలు ఉంటున్నారు. వారిని శిక్షించాలంటే మైనర్లు అనే సాకు చెప్పి పేరు కూడా చెప్పకుండా బయటకి వదిలేస్తున్నారు. 18 ఏళ్లకు అతను బయటకు వెళ్తున్నాడు. బయటి సమాజానికి ఇతని వ్యక్తిత్వం తెలిసే అవకాశం లేదు.
అమ్మాయిలు 13-16 ఏళ్లలో ఇష్టపూర్వకంగానే అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు. కాబట్టి వీరి వివాహ వయసును తగ్గించాలనే ప్రతిపాదనపై లా కమిషన్ పలు కీలకమైన సిఫార్సులు చేసింది. పెళ్లి వయసును 18 నుంచి 16 కు తగ్గించాలనే ప్రతిపాదన సరైంది కాదని దీనిని యథాతధంగా ఉంచాలని పేర్కొంది.
పోక్సో కింద వయసును తగ్గిస్తే బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వ్యాపారాన్ని నిరోధించడం కష్టమవుతుందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో 16-18 ఏళ్ల కౌమార ప్రాయ అనియంత్రిత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో వీరి ఇద్దరికీ పరోక్ష అంగీకారం ఉందని న్యాయస్థానం భావిస్తే విచక్షణ మేరకు తీర్పులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పించింది. యుక్త వయసులో ఉన్నవారి మధ్య సంబంధాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు న్యాయ స్థానాలు.. వారి వివాహ వయసును తగ్గించాలన్న సూచన మేరకు ఈ నివేదికను సమర్పించింది.